ట్రేండింగ్ లో ‘వారు- వీరు’..!

‘వాడు- వీడు’ కాస్త ఇప్పుడు ‘వారూ- వీరు’ అయ్యింది. అదేంటి కొంపతీసి ‘వాడు – వీడు’ చిత్రానికి సీక్వెల్ గాని రాబోతోందా అని ఆరాట పడకండి. గతంలో ‘వాడు- వీడు’ చిత్రంతో అలరించిన ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు ‘వారు- వీరు’గా మారారు అన్న మాట. ప్రస్తుతం ‘వారు వీరు’ అనే అంశం సోషల్ మీడియా వైరల్ గా మారింది. బాలా దర్శకత్వంలో వచ్చిన ‘వాడు- వీడు’ చిత్రం 2011 లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది.

ఈ చిత్రంలో ఆర్య, విశాల్ నటనకి ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. దీంతో ఆ చిత్రానికి ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు మన ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి పెళ్ళి చేసుకోనుండడంతో… ‘వాడు- వీడు’ కాస్త ‘వారు- వీరు’ అయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆర్య- సాయేషా, విశాల్- అనీషా ఫోటోలను కలిపి వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ నెటిజెన్ ఈ కామెంట్ తో పోస్ట్ చేసాడు. ఇక అంతే… ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు దానిని రీ ట్వీట్ చేస్తూ యువ జంటలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఆర్య‌- సాయేషా మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. మరో పక్క విశాల్- అనీషా నిశ్చితార్థం కూడా జరిగింది. వచ్చే సెప్టెంబర్‌లో వీరి వివాహం ఘనంగా జరగనుంది. ఈ విధంగా ‘వాడు-వీడు’ కాస్త… ఒకే సంవత్సరంలో ‘వారు- వీరు’ అయ్యారన్న మాట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus