విశాల్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు.. !

కోలీవుడ్ హీరో నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ను తాజాగా చెన్నై సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా కొందరు నిర్మాతలతో విశాల్ కి వివాదం చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ గొడవ మరింత బలపడటంతో పోలీసులు విశాల్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.అసలు విషయంలోకి వస్తే.. ‘విశాల్ తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని కొంద‌రు నిర్మాతలు తాజాగా త‌మిళ‌నాడు సీఎంను కలిసి అతని పై కంప్లైంట్ ఇచ్చారు. విశాల్ త‌న‌కు ఇష్టానుసారంగా సినిమాల విడుద‌ల‌కు అనుమతులు ఇస్తున్నాడని.. డిసెంబర్ 21న ఒకేసారి 9 సినిమాలు విడుదల చేయడానికి విశాల్ పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదని వారు ఆందోళన చెందుతూ కంప్లైంట్ ఇచ్చారంట.

ఇలా ఇన్ని చిత్రాలకు పర్మిషన్లివ్వడం ద్వారా కొందరి నిర్మాతలకు నష్టం చేకూర్చే విధంగానే ఉందని ఆరోపిస్తూ ఆయనని వెంటనే అధ్యక్ష పదవి నుండీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.డిసెంబర్ 19 బుధవారం రోజున స్థానిక టి.నగర్ లోని నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారట. ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్ని రద్దు చేసి.. వెంటనే మళ్ళీ ఎన్నికలు జరపాలని, లేదంటే వారంతా ఓ కమిటీగా ఏర్పడి నిర్మాతల మండలి పనులు చూసుకుంటామని హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా గురువారం రోజున (ఈ రోజు) నిర్మాతల మండలి కార్యాలయానికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడట విశాల్. ఆలా చేయడంతో ఒక్కసారిగా అక్కడి వివాదం మరింత జోరందుకున్నట్టు తెలుస్తుంది. పరిస్థితి ఉద్రిక్తం చెందడంతో చెన్నై పోలీసులు విశాల్ ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus