తెలుగు, తమిళంలో పేరున్న నటుడు విశాల్. మంచి నటుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా అందరికి తెలుసు. తన కెరీర్ ని మలుపు తిప్పిన పందెం కోడి కి సీక్వెల్ తీసి సూపర్ హిట్ అందుకున్నారు. పందెం కోడి 2 విజయవంతం కావడంతో పందెం కోడి 3 చేయడానికి స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టమని డైరక్టర్ లింగుస్వామికి చెప్పారు. అలాగే మీడియాతో తన తదుపరి సినిమాల గురించి వెల్లడించారు. ఎన్టీఆర్ లోని నటనను వెలికితీసిన చిత్రాల్లో టెంపర్ ఒకటి. ఇందులో తారక్ క్యారెక్టరైజేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ పాత్రని వక్కంతం వంశీ సృష్టించగా.. పవర్ ఫులా గా చూపించడం పూరి జగన్నాథ్ కే సాధ్యమయింది. డైరక్టర్, రైటర్ అనుకున్నదానికంటే ఆ పాత్రను మరింత ఎనర్జీతో ఎన్టీఆర్ నటించి మెప్పించారు.
ఆ పాత్ర పవర్ నచ్చి ఈ సినిమాని విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రీసెంట్ గా సెట్స్ మీదకి వెళ్ళింది. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని కేవలం తమిళంలోనే రిలీజ్ చేస్తామని, తెలుగులో రిలీజ్ చేయనని విశాల్ ముందుగానే స్పష్టం చేశారు. తారక్ మాదిరిగా తాను నటించలేనని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ కి సామాన్యులే కాదు స్టార్స్ కూడా అభిమానులే అని అర్ధమయింది.