ఒక్కరో ఇద్దరో కాదు.. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ హీరోలందరి చూపు రివ్యూ రైటర్లపైనే పడుతుంది. వాళ్లేదో అద్భుతాలు చేస్తుంటే కావాలనే రివ్యూ రైటర్లు వాటిని చెడగొడుతున్నారు అన్నట్లు మాట్లాడేస్తున్నారంతా. ఇప్పుడు విశాల్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన లాంటి హీరో నుంచి ఇలాంటి స్పందన ఊహించడం కష్టమే కానీ ఈయన కూడా ఇప్పుడు రివ్యూ రైటర్లపై ఫైర్ అయ్యాడు. తమిళ ఇండస్ట్రీలో విశాల్ కు ఇప్పుడు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. మనోడు ఏం చేసినా సంచలనమే ఇప్పుడు. ఆ మధ్య నిర్మాతల మండలి ఎన్నికల్లో కూడా గెలిచాడు. రియల్ ఇమేజ్ సాధించి దూసుకుపోతున్నాడు ఈ హీరో.
అందరికీ హీరో అవుతున్న ఈయన ఇప్పుడు రివ్యూ రైటర్లకు మాత్రం విలన్ అవుతున్నాడు. ఓ సినిమా చూసిన తర్వాత రివ్యూలు నిమిషాలపై పెట్టేస్తున్నారు ఇప్పుడు రైటర్లు. వెబ్ సైట్లు నడవాలంటే రివ్యూలు అప్ డేట్లు ఉండాల్సిందే. కానీ రివ్యూలు వెంటనే రాయడం తప్పంటున్నాడు విశాల్. సినిమా విడుదలైన తర్వాత కనీసం మూడు రోజులైనా ఆగి రాయండంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. చిన్న సినిమాలకు రివ్యూలు చాలా దెబ్బ తీస్తున్నాయి అంటున్నాడు ఈ హీరో. సరే.. ఒకవేళ రివ్యూలు రాయలేదు అనుకుందాం.. మరి సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెడుతున్నారు కదా.. మరి వాళ్లను ఎలా ఆపుతాడో మన విశాల్ బాబు