కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘ప్రేమ చదరంగం’ నుండి మొన్నొచ్చిన ‘సామాన్యుడు’ వరకు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. విశాల్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే ముద్ర ఉంది. ముఖ్యంగా తెలుగులో అతని సినిమాలకు పెద్దగా నష్టాలు కూడా రావు. బాక్సాఫీస్ రిజల్ట్ ను పక్కన పెడితే విశాల్ ఓ సినిమా చేశాడు అంటే అందులో మంచి కంటెంట్ ఉంటుంది అని అందరూ నమ్ముతారు.
ఇదిలా ఉండగా.. తమిళనాడులో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నో మంచి పనులు చేసి మరింత పాపులర్ అయ్యాడు. అలాగే వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. తాజాగా అతను స్టేజి పై ఓ నటుడిని కొట్టడం చర్చనీయాంశం అయ్యింది. ‘లాఠీ’ టీజర్ లాంచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఈవెంట్ లో నటుడు రోబో శంకర్ స్టేజిపై ఎక్కి విశాల్‌కు ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ‘విశాల్ సార్! నేను మీతో రెండు సినిమాలు చేశాను.
అందరికీ ఫోన్ చేసి సినిమాల్లోకి తీసుకుంటారు. వాళ్లకు ఏం కావాలో అన్నీ అడిగి తెలుసుకుని చేస్తారు.’నన్ను మాత్రం ఏదో పిలవాలి అంటే పిలవాలి అన్నట్లు పిలుస్తారు.ఇక నుండి అలా చేయకండి సార్’’ అని అన్నాడు. దీనికి విశాల్ కోపం తెచ్చుకుని రోబో శంకర్ ని మైకు లాక్కుని కొట్టాడు.మళ్ళీ రోబో శంకర్ ఏదో మాట్లాడబోతే ఇంకోసారి కొట్టాడు. పక్కనే ఉన్న సూరి కోపంగా వెళ్లిపోతుంటే పిలిచి నవ్వేశాడు. దీంతో ఇది ప్రాంక్ అని తేలిపోయింది. షూటింగ్ సమయంలో విశాల్ చాలా జోవియల్‌గా ఉంటాడట. రోబో శంకర్, సూరిలతో కలిసి ఉన్నప్పుడు ఇలా ప్రాంక్ లు చేస్తాడు అని ఈ సందర్భంగా వాళ్ళు తెలిపారు.