విశాల్, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. విశాల్ కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విశాల్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ చిత్రాన్ని కూడా పెద్ద స్థాయిలో విడుదల చేశారు. మొదటిరోజు ఈ చిత్రానికి డీసెంట్ టాకైతే వచ్చింది. కానీ మరో పక్క సందీప్ కిషన్ చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ చిత్రం కూడా పోటీగా ఉండడంతో ‘యాక్షన్’ చిత్రానికి పెద్ద రేంజ్లో అయితే ఓపెనింగ్స్ రాలేదు.
నైజాం | 0.78 cr |
సీడెడ్ | 0.27 cr |
ఉత్తరాంధ్ర | 0.21 cr |
ఈస్ట్ | 0.14 cr |
వెస్ట్ | 0.10 cr |
కృష్ణా | 0.11 cr |
గుంటూరు | 0.12 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ + తెలంగాణ | 1.79 cr(share) |
ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ‘యాక్షన్’ చిత్రానికి 1.79 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 6.7 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మరో 5 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. కానీ ఇలా యావరేజ్ ఓపెనింగ్స్ తో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఈరోజు నుండీ అసలు పరీక్ష మొదలు కానుంది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వస్తేనే కానీ అంత పెద్ద టార్గెట్ ఛేదించడం అసాధ్యం..! మరి మొదటివారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!