విశాల్ యాక్షన్ థియేట్రికల్ బిజినెస్..!

విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘యాక్షన్’. సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ట్రైడెంట్ ఆర్ట్స్’ బ్యానర్ పై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు. విశాల్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం. ఇక ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉన్నట్టు ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లు చూస్తే స్పష్టం అవుతుంది. ఇక ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగానే అవుతుందని తెలుస్తుంది. తెలుగులో కూడా ఈ చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో హీరో విశాల్ సినిమాలకి మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో ‘యాక్షన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విశాల్ గత చిత్రాలు ‘అభిమన్యుడు’ 9 కోట్ల షేర్ ను వసూల్ చేయగా.. ‘పందెంకోడి2’ చిత్రం 6 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. అయితే ‘టెంపర్’ రీమేక్ అయిన ‘అయోగ్య’ చిత్రాన్ని మళ్ళీ తెలుగులో విడుదల చేయగా ఆ సినిమా విడుదలైనట్టు కూడా ఎవ్వరికీ తెలీదు. అయితే ‘యాక్షన్’ సినిమాకి 5 కోట్ల బిజినెస్ జరగడం డీసెంట్ అనే చెప్పాలి.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus