Manchu Vishnu: మంచు విష్ణు, సన్నీలియోన్ ల ఫన్నీ వీడియో వెనుక అంత కథ ఉందా?

మంచు విష్ణు, సన్నీ లియోన్ ల ఫన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.’పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి పాటకి విష్ణు, సన్నీ లియోన్ లు సరదాగా ఓ రీల్ చేశారు. మంచు విష్ణు క్యాజువల్ గా నడుచుకుంటూ వస్తున్న తరుణంలో చాటుగా ఉంది భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది సన్నీ లియోన్. కానీ తర్వాత సన్నీ లియోన్ ను ఆటపట్టిస్తారు విష్ణు. అయితే ఈ రీల్ వెనుక ఉన్న కథ వేరు.

‘గాలి నాగేశ్వరరావు’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు మంచు విష్ణు. ఇదే సినిమాలో రేణుక అనే పాత్రలో నటిస్తోంది హాట్ బ్యూటీ సన్నీలియోన్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. షూటింగ్ రోజున ఖాళీ సమయంలో ఇలా విష్ణు, సన్నీ లు రీల్ చేసారు. సన్నీలియోన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ ను పోస్ట్ చేసింది. అంతే కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోకి… ‘అండ్ ఎగైన్ ఎపిక్ ఫెయిల్ ఫర్ మీ..’ అంటూ కామెంట్ పెట్టాడు మంచు విష్ణు.’అది రా మా విష్ణు అన్న రేంజ్’ ‘అన్నకి అసాధ్యమంటూ ఏమీ లేదు’ ‘లెట్ దెం ఎంజాయ్ అంకుల్.. లెట్ దెం ఎంజాయ్’ అంటూ..ఈ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. డా.మంచు మోహన్ బాబు ప్రెజెంట్స్ లో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.చోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భాను, నందు డైలాగ్ రైటర్స్ గా పనిచేస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించడం విశేషం. మరో పక్క మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న మంచు విష్ణు.. వాటి పనుల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus