Vishwak Sen: విశ్వక్ సేన్ కి వింత అనుభవం.. ఏమైందంటే?

  • February 8, 2024 / 11:47 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఆయన చేస్తున్న వరుస సినిమాల్లో ‘గామి’ ఒకటి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’పై ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదొక అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తుంది. టైటిల్ గ్లింప్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. తాజాగా ‘గామి’ రిలీజ్ డేట్ తో పాటు మేకింగ్ వీడియోని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మార్చి 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి అదే డేట్ కి విశ్వక్ సేన్ నటిస్తున్న మరో సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ కావాలి. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల డిలే అవుతుండటంతో ‘గామి’ వస్తుంది అని విశ్వక్ సేన్ చెప్పాడు.

అలాగే ఈ సినిమా షూటింగ్ అనుభవాలను కూడా విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పుకొచ్చాడు. ‘గామి’ లో అతను ఓ అఘోరాగా కనిపించబోతున్నాడు. అతని లుక్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. 2018 లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ క్రౌడ్ ఫండింగ్ వంటి వ్యవహారాల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది అని విశ్వక్ చెప్పాడు.

అయితే షూటింగ్ సమయంలో నిజంగా అతను అఘోరా అని భావించి కొందరు ‘చేతిలో డబ్బులు వేసినట్లు’ చెప్పి షాక్ ఇచ్చాడు విశ్వక్ సేన్. లుక్ విషయంలో అతను పెట్టిన శ్రద్ధ, దర్శకుడి సహకారం అలాంటివి అని విశ్వక్ ఈ సందర్భంగా తెలియజేశాడు

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus