Vishwak Sen: దాస్ కా ధమ్కీ సీక్వెల్ గురించి విశ్వక్ సేన్ స్పష్టత ఇదే!

  • March 24, 2023 / 06:02 PM IST

దాస్ కా ధమ్కీ సినిమాతో విశ్వక్ సేన్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమా ఈ వీకెండ్ సమయానికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విశ్వక్ సేన్ నటుడిగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. దాస్ కా ధమ్కీ సక్సెస్ తర్వాత విశ్వక్ సేన్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

యాక్షన్, డ్రామా సీన్స్ ను నేను బాగా డైరెక్ట్ చేస్తానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. దాస్ కా ధమ్కీ సినిమాలో కామెడీ సీన్లు బాగా వచ్చాయని నన్ను అభినందిస్తూ ఎన్టీఆర్ మెసేజ్ పెట్టారని విశ్వక్ సేన్ తెలిపారు. మొదట డ్యూయల్ రోల్ చేయగలనా అని అనిపించిందని నెగిటివ్ రోల్ లో నేను బాగా చేశానని కామెంట్లు వస్తున్నాయని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. లియోన్ జేమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని ఆయన తెలిపారు.

త్వరలో నా సొంత బ్యానర్ లో ఊహించని ప్రకటన రానుందని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. సినిమాలో ట్విస్ట్ లు ఎక్కువగా ఉన్నాయని అనిపించి ఒక పాట పెట్టామని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ఈ సినిమాకు తొలిరోజే 8 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయని ఆయన తెలిపారు. నివేదా నన్ను త్రివిక్రమ్ తో పోల్చడంతో ఆమెకు థ్యాంక్స్ చెప్పానని త్రివిక్రమ్ తర్వాత అంత ఎనర్జీ ఉందని నివేదా చెప్పిందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

దాస్ కా ధమ్కీ2, ఫలక్ నుమా దాస్2 నా డైరెక్షన్ లో వస్తాయని ఆయన అన్నారు. విశ్వక్ సేన్ నటించిన గామి మరో రెండు నెలల్లో రిలీజ్ కానుంది. వరుస సినిమాలతో విశ్వక్ సేన్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. అర్జున్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన సినిమా నుంచి తప్పుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమా గురించి మాత్రం స్పందించలేదు. విశ్వక్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus