Vishwak Sen, Arjun: ఆ విషయాలు ఎవరికీ తెలియదు.. విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ఎదిగిన హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ హీరో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం గామి అనే సినిమాలో నటిస్తుండగా మరో మూడు వారాల తర్వాత ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నటుడు అర్జున్ చేసిన ఆరోపణలు విశ్వక్ సేన్ కెరీర్ కు కొంతమేర డ్యామేజ్ చేశాయనే సంగతి తెలిసిందే. అయితే విశ్వక్ సేన్ ఆ కామెంట్ల గురించి మరోసారి రియాక్ట్ అయ్యారు.

బ్యాగ్రౌండ్ ఉన్న హీరోకు ఇలా జరిగితే ఏమయ్యేదని విశ్వక్ సేన్ ప్రశ్నించారు. అర్జున్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను క్యాన్సిల్ చేయాలని నేను కోరలేదని ఆయన అన్నారు. ఒక్కరోజు షూటింగ్ ఆపాలని మాత్రమే నేను కోరానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. నేను అలా చెప్పడంతో అర్జున్ మా ఇంటికి వచ్చి మా అమ్మానాన్నలకు రిక్వెస్ట్ చేయడం జరిగిందని అవి ఎవరికీ తెలియదని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.

నాకు సినీ బ్యాగ్రౌండ్ లేదనో, ఇంకేదో అనుకుని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఉండవచ్చని విశ్వక్ సేన్ అన్నారు. ఆ విషయాన్ని నేను సాగదీయాలని అనుకోవడం లేదని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు. నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని నేను తీసుకున్న రెమ్యునరేషన్ కు రెట్టింపు ఇచ్చేశానని ఆయన వెల్లడించారు. ఆయన కోపంలో చేసిన దాని వల్ల ఎక్కువ నష్టపోయింది నేనేనని విశ్వక్ సేన్ తెలిపారు.

సవారి డైరెక్టర్ చెప్పిన కథకు సంబంధించి సెకండాఫ్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని ఆయన కామెంట్లు చేశారు. విద్యాధర్ డైరెక్షన్ లో గామి సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. విశ్వక్ సేన్ (Vishwak Sen) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus