Vishwak Sen: తారక్ ఇండియాలో గొప్ప నటుడు.. విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నిన్ను చూడాలని సినిమా నుంచి ఆర్.ఆర్.ఆర్ సినిమా వరకు ప్రతి సినిమాలో తన అద్భుతమైన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. రాజమౌళి (S. S. Rajamouli) , కృష్ణవంశీ (Krishna Vamsi) , హరీష్ శంకర్ (Harish Shankar) మరి కొందరు దర్శకులు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటన గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. తారక్ కు యంగ్ హీరోలలో ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ (Vishwak Sen) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలోనే గొప్ప నటుడు అంటూ విశ్వక్ సేన్ కాంప్లిమెంట్ ఇవ్వగా ఆ ప్రశంస హాట్ టాపిక్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ మరోసారి ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ అంటే ఎంతో అభిమానం అని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ తొడగొట్టే సన్నివేశం ఉంటుందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ అంటే తారక్ కు సైతం ప్రత్యేకమైన అభిమానం ఉంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరవుతారేమో చూడాల్సి ఉంది. దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki) మూవీ ఈవెంట్ కు తారక్ గెస్ట్ గా హాజరు కావడం వల్ల ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. దాస్ కా ధమ్కీ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటికే పలు రిలీజ్ డేట్లను మార్చుకున్న ఈ సినిమా మే నెల 17వ తేదీన కచ్చితంగా విడుదల కానుందని సమాచారం అందుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విశ్వక్ సేన్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus