Vishwak Sen, Arjun Sarja: నా మాటకు గౌరవం ఇవ్వలేదు.. అందుకే సినిమా నుండి తప్పుకున్నాను: విశ్వక్ సేన్

యంగ్ హీరో విశ్వక్ సేన్, సీనియర్ స్టార్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అందుకు కారణం హీరో విశ్వక్ సేన్ అని, అతను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ రావడం వల్లనే సినిమా డిలే అవుతుందని ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు అర్జున్. అంతేకాదు విశ్వక్ సేన్ డెడికేషన్ లేని హీరో అని.. అతనికి ప్రొఫెషనలిజం అంటూ లేదని అర్జున్ మండిపడ్డాడు.

డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్, లిరిసిస్ట్ చంద్రబోస్ తో విశ్వక్ సేన్ కి పడట్లేదని.. అందుకే ఈ సినిమాని అతనితో చేయలేకపోతున్నానని, వేరే హీరోతో చేస్తానని.. టాలీవుడ్లో ఇంకా చాలా మంది హీరోలు, టాలెంట్ ఉన్న హీరోలు ఉన్నారని అర్జున్ తెలియజేశాడు. అంతేకాదు తనలా మరో నిర్మాతకు జరగకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపాడు. ఈ విషయం పై హీరో విశ్వక్ సేన్ కూడా స్పందించాడు. ‘డైలాగ్స్, పాటలు, మ్యూజిక్, లిరిక్స్ ఇలా విషయంలో నేను ఇవాల్వ్ అయ్యి ఐడియాస్ ఇచ్చిన మాట నిజమే.!

కానీ నేను చెప్పిన మార్పులకు అర్జున్ అస్సలు అంగీకరించడం లేదు.’నేను చెప్పినట్లే నడుచుకోవాలి’ అనేవారు. నాకు గాని నా మాటకు కానీ సెట్లో అస్సలు గౌరవం ఇవ్వడం లేదు. నా మనసుకు నచ్చని పని చేయలేక, సినిమా నుంచి బయటకు వచ్చేశాను’ అంటూ అతను చెప్పుకొచ్చాడు. అలాగే ‘మూవీ రెమ్యూనరేషన్, చెక్కులు, డాక్యుమెంట్లు.. నిర్మాతల మండలికి పంపినట్టు’ కూడా విశ్వక్ చెప్పుకొచ్చాడు.

అయితే ఇక్కడ తప్పు కూడా విశ్వక్ సేన్ దే అని చెప్పాలి. ఎందుకంటే తనకు ఇబ్బంది అనిపించినప్పుడు ముందుగానే చెప్పి ప్రాజెక్టు నుండి తప్పుకోవాలి. కానీ షూటింగ్ ప్రారంభమయ్యే ముందు మెసేజ్ లు పెట్టి దర్శకుడిని కానీ నిర్మాతను అలాగే యూనిట్ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus