Vishwak Sen: హిట్లు లేకపోయినా.. అవకాశాలకు లోటు లేదు!

ఇండస్ట్రీ సక్సెస్, ఫెయిల్యూర్ మీద నడుస్తుంటుంది. సక్సెస్ లో ఉన్నవారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ ప్లాప్ పడితే మాత్రం పట్టించుకోరు. కానీ విశ్వక్ సేన్ దీనికి మినహాయింపు అనే చెప్పుకోవాలి. ‘ఫలక్ నుమా దాస్’ తరువాత విశ్వక్ సేన్ కి ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. ‘హిట్’ సినిమా మాత్రం బాగానే ఆడింది. ‘పాగల్’ డిజాస్టర్ అయింది. ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమా ఓకే అనిపించుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు.

రీసెంట్ గా విశ్వక్ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ అనే సినిమాను ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేసి.. ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. అయితే కెరీర్ పరంగా ఇవన్నీ విశ్వక్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు. హిట్, ప్లాప్ అనేది పట్టించుకోకుండా కుర్ర హీరోకి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

ప్రస్తుతం విశ్వక్ సేన్ తన సొంత బ్యానర్ లో ‘ధమ్కీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అర్జున్ సర్జా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇవి కాకుండా తాజాగా మరో సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. సాహిత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా రూపొందించనున్నారు. ఈ సినిమా ఓ పెద్ద బ్యానర్ లో ఉంటుందని టాక్. ఇవి కాకుండా.. విశ్వక్ చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయట.

ప్రస్తుతం అవి డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్లు సమాచారం. అలానే మైత్రి మూవీ మేకర్స్, సితార సంస్థలు కూడా విశ్వక్ కి అడ్వాన్స్ లు ఇచ్చాయని అంటున్నారు. హిట్టు లేకపోయినా.. విశ్వక్ కి డిమాండ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఇక హిట్టు పడితే అతడికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus