Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

టాలీవుడ్‌లో “మాస్ కా దాస్”గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్ సినీ ప్రయాణం వెనుక ఉన్న ఇబ్బందులు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. స్టైలిష్‌గా కనిపించే ఈ హీరో జీవితంలో కెరీర్ లో తొలినాళ్లలో మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పుట్టినప్పుడు సొంత ఇల్లు కూడా లేకపోవడం నుంచి, చదువు కోసం కుటుంబం పడిన ఇబ్బందుల వరకు ప్రతి దశలోనూ తనకు తన కష్టం మాత్రమే తోడుగా ఉంది.

Vishwak Sen

విశ్వక్ తండ్రి మొదట కరాటే ట్రైనర్‌గా పనిచేశారు. కానీ ఆ ఆదాయం కుటుంబాన్ని పోషించడానికి సరిపోకపోవడంతో కన్స్ట్రక్షన్ రంగంలోకి వెళ్లాల్సి వచ్చింది. కొడుకు చదువు కోసం ఆయన చేసిన త్యాగాలు విశ్వక్ మనసులో ఇప్పటికీ అలానే ఉన్నాయట. ఆర్థిక సమస్యల వల్ల హయ్యర్ స్టడీస్ ఆగిపోయినా, సినిమాలపై మక్కువతో విశ్వక్ పడ్డ కష్టానికి ఈరోజు ఆయన హీరోగా స్థిరపడ్డాడు.

సినిమాల్లోకి రాకముందు విశ్వక్ పరిస్థితి ఎంత సాదాసీదానో ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఒకప్పుడు తన బ్యాంక్ ఖాతాలో 50 వేల రూపాయలు ఉండటం కూడా పెద్ద కలగా భావించేవాడట. కానీ అదే యువకుడు, కేవలం తన టాలెంట్‌తోనే ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం.

‘ఫలక్‌నుమా దాస్’ సినిమా ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ సినిమా తర్వాతే మొదటిసారి లక్ష రూపాయల బ్యాలెన్స్ చూసిన అనుభూతిని ఆయన పంచుకున్నారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతూ, ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ముద్ర వేస్తున్నారు.

బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కష్టపడితే సాధ్యం కాదనేది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి విశ్వక్ సేన్. ఆయన జీవితం నేటి యువతకు ఓ బలమైన మెసేజ్ ఇస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, తనను తాను నిరూపించుకుని నిలబడ్డ యువ హీరో విశ్వక్ సేన్, రేపు అనగా మార్చ్ 29 న పుట్టినరోజు జరుపుకోనుండగా మరెంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే !

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus