Vishwak Sen: ఫ్యాన్స్ కు ఇక పుల్ మీల్స్ వే..!

తెలుగు ఓటీటీ మాధ్యమంగా చెబుతున్న ఆహాలో వెర్సటైల్ హీరో యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆహాలో బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్ లో, స్పెషల్ టాక్ షోస్, రియాలిటీ షోస్ తో అలరిస్తోంది. ఇక అందులో భాగంగా ఇప్పుడు మరో విలక్షణమైన షోతో ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. మరో యువ తెలుగు నటుడు ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో డెబ్యూ చేయనున్నాడు.

అతను మరెవరో కాదు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్. త్వరలో 15-ఎపిసోడ్ లు వున్న ఒక షో తో ఆహా Aha ఓటిటి ఛానల్ లో డెబ్యూ చేయనున్నాడు అని తెలిసింది. కొన్ని వారాల్లో ఈ షో ప్రారంభం కాబోతోందని, దీని మీద అధికారిక ప్రకటన త్వరలో ఆహా ఛానల్ నుండి రాబోతోందని తెలిసింది.ఇదే ఆహా ఛానల్ ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణతో అన్‌స్టాపబుల్’ షో అనే రియాలిటీ షో చేసిన సగంతి తెలిసిందే.

ఈ షో చాలా పెద్ద హిట్ అయిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు అదే పంథాలో ఇంకో నటుడు ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’, ‘హిట్‌’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధ‌మ్కీ’ వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ హీరోగా త‌న‌దైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యువ కథానాయ‌కుడు విశ్వ‌క్ సేన్‌ తో ఈ షో వుండబోతోంది అని తెలిసింది.

మంచి టాలెంట్ వున్న విశ్వక్ సేన్ (Vishwak Sen) మంచి నటుడుగా వెండి తెర మీద గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే వైవిధ్యమైన పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు. అలంటి విశ్వక్ సేన్ ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా అల‌రించ‌బోతున్నాడు అనే విషయంలో అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విశ్వ‌క్ సేన్‌ను చూడ‌న‌టువంట స‌రికొత్త అవ‌తార్‌లో ఆహా ఛానల్ ఆవిష్క‌రించ‌నుంది అని తెలిసింది. అందుకే మొదటి సీజన్ గా ఈ షోని 15 ఎపిసోడ్స్‌ గా సిద్ధం చేస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus