ఉత్కంఠతను రేపుతున్న విశ్వరూపం 2 ట్రైలర్

విశ్వనటుడు కమల్ హాసన్ ఉగ్రవాద నేపథ్యంలో తెరకెక్కించిన విశ్వరూపం సినిమా 2013 లో రిలీజ్ అయి… వివాదాలను దాటుకుంటూ విజయం అందుకుంది. ఆ సమయంలోనే విశ్వరూపం సీక్వెల్ త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అనుకున్నదానికంటే ఎంతో ఆలస్యంగా విశ్వరూపం 2 మనముందుకు రాబోతోంది. కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికపై రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే కమల్ హాసన్ పడిన కష్టం తెలుస్తోంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఉంటాయని ఈ వీడియో స్పష్టం చేసింది.

హీరోయిన్లుగా నటించిన పూజా కుమార్‌, ఆండ్రియాలు కూడా పోరాట సన్నివేశాల్లో సాహసాలు చేశారు. రిచ్ గా ఉన్న విజువల్స్, గిబ్రాన్‌ మ్యూజిక్ ఉత్కంఠతను రేకెత్తిక్కిస్తోంది. సినిమాని ఎప్పుడు చూద్దామా? అనే ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను కమల్‌ కుమార్తె శృతిహాసన్‌, హిందీ ట్రైలర్‌ను అమీర్‌ ఖాన్‌ విడుదల చేశారు. సెన్సార్ పూర్తి చేసుకొని ‘U’ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 10న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus