Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

ప్రముఖ తమిళ స్టార్‌ హీరో సూర్య.. తెలుగు దర్శకులు.. ఈ కాంబినేషన్‌ గురించి చాలా నెలలుగా వింటూ ఉన్నాం. సూర్య స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేస్తే చూడాలని ఉందంటూ అభిమానులు ఎప్పటి నుండో అడుగుతూనే ఉన్నారు. దానికి సూర్య కూడా నేను చేస్తా అని చెబుతూనే ఉన్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ చర్చకు ఇటీవల సూర్య ఓ ముగింపు పెట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా ఇంకా సెట్స్‌ మీద ఉండగానే మరో తెలుగు దర్శకుడి సినిమాను సూర్య ఓకే చేస్తారు అని సమాచారం.

Suriya

సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన 46వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఆయన మరో సినిమా ‘కరప్పు’ త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత కొత్త సినిమాను అనౌన్స్‌ చేసి, కుదిరితే షూటింగ్‌ స్టార్ట్‌ చేసేయాలని సూర్య అనుకుంటున్నాడట. అందుకే వరుసగా తెలుగు దర్శకుల కథలు వింటున్నారు. మొన్నీ మధ్యే టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ ఓ కథను చెప్పారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ కథను వినిపించారని తాజాగా తెలుస్తోంది.

వివేక్ ఆత్రేయ ఆఖరిగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో నానికి మంచి విజయం ఇచ్చారు. ఇప్పుడు మరి సూర్యకు ఎలాంటి కథ చెప్పారో తెలియాలి. మరి పరశురామ్‌కథ ఓకే అయిందా లేదా అనేది తెలియాల్సి ఉండగా.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ కథకు ఎలాంటి స్పందన వచ్చిందనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే పరశురామ్‌ కథ ఓకే అయితే దిల్‌ రాజు నిర్మిస్తారని టాక్‌. మరి వివేక్‌ ఆత్రేయ సినిమా ఓకే అయితే నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్‌ అవుతుందేమో చూడాలి. లేదంటే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కూడా అయ్యే అవకాశం ఉంది.

‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus