ప్రధాని రేంజ్ లో రెచ్చిపోతున్న బాలీవుడ్ హీరో

“రక్త చరిత్ర, వినయ విధేయ రామ” చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపుతోపాటు మార్కెట్ ఏర్పరుచుకున్న వివేక్ ఒబెరాయ్ గత రెండు రోజులుగా అనవసరమైన కారణాల వల్ల మీడియాలో హైలైట్ అవుతూ వచ్చాడు. ఐశ్వర్యరాయ్ తన కెరీర్ తొలినాళ్లలో సల్మాన్ ఖాన్ తో, ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్, చివరికి అభిషేక్ బచ్చన్ తో సెటిల్ అయిన ఒక మీమ్ ను షేర్ చేయడంపై వివేక్ ను అందరూ తప్పుబట్టారు. ఈ విషయమై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నాడు వివేక్.. ఆఖరికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వివేక్ పోస్ట్ ను తప్పబట్టారు.

కానీ.. వివేక్ ఒబెరాయ్ మాత్రం తాను చేసిన చెత్త పనిని సమర్ధించుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా.. సోనమ్ కపూర్ ను “నువ్వు సినిమాల్లో ఓవర్ యాక్ట్ చేయడం, సోషల్ మీడియాలో ఓవర్ రియాక్ట్ అవ్వడం తగ్గించాలి” అని సోనమ్ కి రిటార్ట్ ఇచ్చాననుకొని తన స్థాయిని తాను తగ్గించుకొన్నాడు వివేక్ ఒబెరాయ్. మరి ప్రధాన మంత్రి బయోపిక్ లో నటించాడు కాబట్టి బీజేపీ సపోర్ట్ ఉంటుందని వివేక్ ఒబెరాయ్ ఇలా రెచ్చిపోతున్నాడో లేక సినిమాలో ప్రధాన మంత్రిలా నటించాడు కాబట్టి రియల్ లైఫ్ లోనూ అలాగే ప్రధానమంత్రి అనుకుంటున్నాడా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి యాటిట్యూడ్ వల్లే వివేక్ డబ్బు, హోదా, పలుకుబడి ఉన్నప్పటికీ ఒక సాధారణ నటుడిలా మిగిలిపోయాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus