యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వినాయక్ తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నారు. మాస్ సినిమాలతో వినాయక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. మాస్ సినిమాలను అమితంగా ఇష్టపడే ప్రేక్షకులు వినాయక్ ను ఎంతగానో ఇష్టపడతారు. తర్వాత కాలంలో వినాయక్ కామెడీతో కూడిన మాస్ సినిమాలను తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ గా 15 సంవత్సరాల పాటు ఈ డైరెక్టర్ కెరీర్ ను కొనసాగించారు.
ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ ను హిందీలో తెరకెక్కిస్తూ ఆ సినిమాతో వినాయక్ బిజీగా ఉన్నారు. వినాయక్ గత సినిమా ఇంటెలిజెంట్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వినాయక్ హీరోగా శీనయ్య అనే సినిమా తెరకెక్కుతోందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది. అయితే నటనపై తనకు ఇష్టం అలాగే ఉందని వినాయక్ చెప్పకనే చెబుతున్నారు.
తాజాగా వినాయక్ మాట్లాడుతూ శీనయ్య కథను పావుగంట కథగా విన్న సమయంలో ఆ సినిమా కథ నచ్చిందని కానీ ఆ సినిమా కథను రెండున్నర గంటల సినిమా కథగా మార్చిన సమయంలో ఎవరికీ నచ్చలేదని వెల్లడించారు. మంచి కథ దొరికితే తనకు నటించడం ఇష్టమేనని వినాయక్ తెలిపారు. మరోవైపు తన భవిష్యత్తు ప్రాజెక్ట్ గురించి వినాయక్ స్పందించారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణలకు తాను అంటే ఎంతో ఇష్టమని వినాయక్ అన్నారు.
కథ బాగా కుదిరితే త్వరలో తెలుగు సినిమా డైరెక్ట్ చేస్తానని వినాయక్ చెప్పుకొచ్చారు. హీరోలకు తానంటే ఇష్టం కాబట్టి ఆ హీరోలతో మల్టీస్టారర్ తెరకెక్కించలేనని మంచి కథ సెట్ అయితే మాత్రమే కాంబినేషన్ సెట్ అవుతుందని వినాయక్ కామెంట్లు చేశారు. వినాయక్ కు తెలుగులో ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సిద్ధపడతారో లేదో చూడాల్సి ఉంది
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!