బాలకృష్ణ కి కూడా రీమేక్ స్టోరీనే ఎంచుకున్న వినాయక్.!

అఖిల్ సినిమాతో మాస్ డైరక్టర్ వివి వినాయక్ కెరీర్ ట్రాక్ తప్పింది. అతని పని అయిపోయిందని విమర్శించారు. ఆ తర్వాత తమిళంలో హిట్ సాధించిన కత్తి సినిమా కథతో మెగాస్టార్ చిరంజీవిని ఖైదీ నంబర్ 150 గా చూపించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ మూవీ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో వినాయక్ రీమేక్ బాటనే నడిచేందుకు ఫిక్స్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది. బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న

ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో చెన్నకేశవరెడ్డి మూవీ వచ్చింది. ఆ చిత్రం పరాజయం పాలయింది. సో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కన్నడలో హిట్టయిన శివరాజ్ కుమార్ “మఫ్టీ” కథను తీసుకున్నారు. ఈ సినిమాని బాలయ్యకి అనుగుణంగా మార్పులు చేసి తీయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో నటసింహ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ ఏడాది బాలకృష్ణతో ‘జై సింహా’, వినాయక్‌తో ‘ఇంటిలిజెంట్’ చిత్రాలను నిర్మించిన సి. కళ్యాణ్.. ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 27న లాంఛనంగా ప్రారంభం కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus