Vv Vinayak: తారక్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వీవీ వినాయక్!

  • November 10, 2022 / 03:22 PM IST

తారక్ వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆది, సాంబ, అదుర్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. అదుర్స్ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజమయ్యే అవకాశం లేదని తేలిపోయింది. అయితే తాజాగా వీవీ వినాయక్ మాట్లాడుతూ అదుర్స్ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. తారక్ తో నేను అదుర్స్ సినిమా చేయడం పెద్ద సాహసం అని వినాయక్ అన్నారు.

అదుర్స్ మూవీ ఫ్లాప్ గా నిలిచి ఉంటే మా కాంబినేషన్ కు చెడ్డ పేరు వచ్చేదని ఆయన చెప్పుకొచ్చారు. తారక్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరని ఆయన కామెంట్లు చేశారు. తారక్ పాన్ ఇండియా నటుడు కావడంలో ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని ఆయన పేర్కొన్నారు. తారక్ ప్రతిభ ఎలాంటిదో నాకు తెలుసని వినాయక్ అన్నారు. 2023 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని తారక్ చెప్పుకొచ్చారు.

ఠాగూర్ సినిమాను షూట్ చేస్తున్న సమయంలో తాను టెన్షన్ పడ్డానని వినాయక్ అన్నారు. అఖిల్ సినిమా వల్ల తాను ఆర్థికంగా కూడా నష్టపోయానని వినాయక్ చెప్పుకొచ్చారు. తన తర్వాత సినిమాల ఫలితాల విషయంలో వినాయక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వినాయక్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు వినాయక్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

తారక్ తో వినాయక్ మరో సినిమాను తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ లో మరో సినిమా సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. వినాయక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా వినాయక్ బాలీవుడ్ సినిమాలను తెరకెక్కించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus