Waltair Veerayya Collections: 13వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . ఇక మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి.సంక్రాంతి సీజన్ ను ఈ మూవీ కంప్లీట్ గా క్యాష్ చేసుకుంది.పండుగ ముగిశాక కూడా ఈ మూవీ ఇంకా కలెక్ట్ చేస్తూ రికార్డులు కొల్లగొడుతుంది. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 32.65 cr
సీడెడ్ 16.53 cr
ఉత్తరాంధ్ర 15.15 cr
ఈస్ట్ 10.31 cr
వెస్ట్ 5.69 cr
గుంటూరు 7.23 cr
కృష్ణా 7.00 cr
నెల్లూరు 3.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 98.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.51 cr
ఓవర్సీస్ 12.66 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 118.41 cr (షేర్)

‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి రూ.86.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.87 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.118.41 కోట్లు షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.31.41 కోట్ల లాభాలను అందించింది. ఇప్పట్లో క్రేజీ సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు కాబట్టి.. ‘వాల్తేరు వీరయ్య’ కి ఇంకా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus