ఇటీవల కరోనా పరిస్థితులు కొంత తగ్గుతుండడంతో పలు సినిమాలు మెల్లగా ఒక్కొక్కటిగా థియేటర్స్ లో విడుదలవుతుం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇక ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎస్ ఆర్ కల్యాణమండపం, పాగల్ వంటి సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకుని కొనసాగుతున్నాయి. అయితే రాబోయే దసరా పండుగని పురస్కరించుకుని టాలీవుడ్ బడా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని కొన్నాళ్ల క్రితం మేకర్స్ అనౌన్స్ చేసారు.
వాస్తవానికి ఈ సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేసారు, అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ సర్కిల్స్ నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా ఆల్మోస్ట్ వాయిదా పడే పరిస్థితులు గట్టిగా కనపడుతున్నాయని, దీనిని వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు జరుగుతున్నట్లు టాక్. దీనితో ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పలువురు ఇతర సినిమాల నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారని, ముఖ్యంగా ఆ సమయంలో మెగాస్టార్ ఆచార్య, నటసింహం బాలయ్య అఖండ సినిమాలు పక్కాగా దసరా బరిలో నిలవడం ఖాయం గా కనపడుతోందని టాక్.
అయితే వీటిలో అక్టోబర్ 7న అఖండ, అలానే అక్టోబర్ 14 న ఆచార్య విడుదలవుతాయని, ఈ విధంగా కేవలం ఒక వారం గ్యాప్ లో ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడడం ఖాయం అని సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే ఎన్నో ఏళ్ళ విరామం తరువాత మరోసారి మెగాస్టార్, బాలయ్యల మధ్య వార్ షురూ. అయితే ఈ వార్ వన్ సైడ్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాలి….!!
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!