‘క్రెడిట్స్’పై దర్శకుల మధ్య వార్!!!

అనుకున్నదే జరిగింది….జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది…దాదాపుగా టాప్ దర్శకుల లిస్ట్ లో కొరటాల శివని చేర్చింది. అయితే అంతవరకూ బాగానే ఉంది అనుకుంటే పొరపాటె ఎందుకంటే…అసలు కధ అక్కడే మొదలయింది…విషయం ఏమిటంటే…తాజాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ ఒకానొక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యు లో ప్రముఖ దర్శకుడు….టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన బోయపాటిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు….ఇప్పుడు అవే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి….అదే క్రమంలో …ఈ ఇద్దరికీ సంబంధించిన అభిమానులు.. రెండు వర్గాలుగా చీలిపోయి.. సోషల్ మీడియాల్లో దాడులు సైతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే…రైటర్ల తాలూకు ప్రతిభను దర్శకుడు బోయపాటి హైజాక్ చేసి ఆ క్రెడిట్ తను కొట్టేస్తున్నాడు అని స్ర్టయిట్ ఎవే ఆరోపించినట్లే అని అప్పుడే ఇండస్ట్రీ లో టాక్స్ మొదలయ్యాయి.

దీనిపై కొరటాలను అభిమానించే చాలామంది రైటర్లు – దర్శకులు కూడా.. బోయపాటి శ్రీను టైపులో చాలామంది దర్శకులు ఇలాగే క్రెడిట్స్ కొట్టేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో శ్రీను వైట్లపై కోన వెంకట్.. అలాగే సురేందర్ రెడ్డిపై వక్కంతం వంశీ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. ఇక బోయపాటి సైతం తన వైపు నుంచి తాను ఈ విషయంపై చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నాడు…ఇదంతా ముఖ్యంగా ‘క్రెడిట్స్’ ఇవ్వడంలేదు అనే విషయంలోనే తలెత్తుతున్న వివాదం కావడం….మరో పక్క….పబ్లిక్ గా టీవీ ఛానెల్ లో కొరటాల మాట్లాడటం….వల్ల…బోయపాటి కూడా మ్యాటర్ ను పెద్దల దగ్గర పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది….ఏది ఏమైనా…మొత్తానికి బడా…డైరెక్టర్స్ మధ్యన పెద్ద రచ్చ మొదలయింది అని తెలుస్తుంది…ఇది ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus