మహేష్ బాబు తన 25 వ చిత్రమైన ‘మహర్షి’ చాలా స్పెషల్ గా ప్రెస్టీజియస్ గా ఉండాలని.. ఇద్దరు నిర్మాతలకి ఈ బాధ్యతల్ని అప్పజెప్పాడు. వారే దిల్ రాజు, అశ్విని దత్. సినిమా మొదలయ్యి.. రెగ్యులర్ షూటింగ్ జరుగుతుండగా మరో నిర్మాత వచ్చి చేరాడు. ఆయనే పొట్లూరి వి ప్రసాద్(పివిపి). సినిమాకి ఒక నిర్మాతే అయితే.. ఏ గొడవా ఉండదు. లాభమొచ్చినా.. నష్టమొచ్చినా ఆ నిర్మాతే భరిస్తాడు. కానీ ఒక్క చిత్రానికి ముగ్గురు నిర్మాతలు ఉండడంతో డబ్బులు దగ్గర గొడవలు మొదలయ్యాయని తెలుస్తుంది.
అసలు విషయంలోకి వెళితే.. ‘మహర్షి’ నిర్మాతలలో ఒకరైన అశ్వనీదత్ గత చిత్రం ‘దేవదాసు’ సమయంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ కి కోటి అరవై లక్షల వరకూ బాకీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకూ అది చెల్లించలేదంట. దీంతో ఇప్పుడు ‘మహర్షి’ బిజినెస్ లో దాన్ని అడ్జస్ట్ చేయమని సునీల్ అడిగాడట. అయితే దీనికి మిగిలిన నిర్మాతలైన దిల్ రాజు, పివిపి ఒప్పుకోవట్లేదంట. దీంతో అశ్వినీదత్ ఒకవైపు.. దిల్ రాజు, పివిపి లు మరో వైపు అయిపోయినట్టు తెలుస్తుంది. కోర్టు వరకూ వెళ్లేంతలా వీరి మధ్య రభస జరుగుతుందట. అయితే అశ్వనీదత్ కూతురు స్వప్నాదత్ సీన్ లోకి ఎంటరయ్యి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంటే.. ఇలా గొడవలు పెట్టుకోవడం సరికాదని ఆమె దిల్ రాజు తో చెప్పడంతో.. అయన స్వప్నాదత్ మాట విని కూలయ్యారనీ.. అలాగే పీవీపి ని కూడా కంట్రోల్ చేసారని సమాచారం.