ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. తర్వాత గీత గోవిందం సినిమాతో హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకుల్లో చెదరని ముద్ర వేసింది. తర్వాత పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం సౌత్ టు నార్త్ నేషనల్ క్రష్ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం అమ్మడిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. జనాలు పచ్చి బూతులు తిడుతున్నారు. రష్మిక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయింది. తర్వాత రష్మిక మందన్నా పేరు ఓ రేంజ్ లో మార్మోగిపోతుంది. ఈ పాటలో రష్మిక మందన్నా.. తన కెరీర్లో ఎన్నడూ లేనంత హాట్ గా కనిపించిందని టాక్. అంతేకాకుండా రణ్ బీర్ కపూర్ తో లిప్ లాకులు.. అది కూడా దారుణాతి దారుణంగా ఉండడం.. పచ్చిగా వల్గర్ గా చూపించడంతో రష్మిక ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయాయి.
గీత గోవిందం నుంచి (Vijay) విజయ్ దేవరకొండ, రష్మిక లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఈ పాట చూశాక.. వారికి కడుపు రగిలిపోతోంది. అమ్మడిని అమ్మనా బూతులు తిడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. విజయ్ సైతం రష్మిక చేసిన పని పై ఫుల్ కోపంతో రగిలిపోతున్నాడట.
అంతేకాదు ఆమె ఫోన్ నంబర్ ను బ్లాక్ చేసేశాడట. అది చూశాక నిజంగా ప్రేమించిన ప్రతి మగాడికి కచ్చితంగా కోపం వస్తుంది. అయితే ఇది కేవలం సినిమా కోసమే అంటూ కొందరు జనాలు అనుకుంటుంటే.. మరికొందరు సినిమా ఇండస్ట్రీలో ఇది కామన్ అంటున్నారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు