War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

బాలీవుడ్లో ఎన్టీఆర్ చేసిన మొదటి స్ట్రైట్ మూవీ ‘వార్ 2’. హృతిక్ రోషన్ తో కలిసి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించాడు ఎన్టీఆర్. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారి స్పై మల్టీ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని రూపొంచారు ఆదిత్య చోప్రా. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దీనికి దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.

War 2 Collections

తెలుగు ప్రేక్షకులకు అయితే ఈ సినిమా అస్సలు నచ్చలేదు. అయినప్పటికీ మొదటి నుండి ఉన్న హైప్ కారణంగా ‘వార్ 2’ మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. కానీ వీక్ డేస్ తర్వాత చేతులెత్తేసింది.నార్త్ లో కూడా సేమ్ సీన్. చూస్తుంటే సినిమా సగానికి సగం రికవరీ సాధించడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 10.44 cr
సీడెడ్  7.88 cr
ఉత్తరాంధ్ర 5.12 cr
ఈస్ట్ 2.81 cr
వెస్ట్ 1.97 cr
గుంటూరు 3.33 cr
కృష్ణా 2.65 cr
నెల్లూరు 1.64 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 35.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.26 cr
ఓవర్సీస్ 2.58 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 41.68(షేర్)

 

‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి వారం ఈ చిత్రం రూ.41.68 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.77.5 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.46.32 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ వరకు కొంతలో కొంత ఓకే అనిపించినా,వీక్ డేస్ లో మాత్రం చేతులెత్తేసింది ఈ చిత్రం. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెళ్లడం కూడా కష్టమే అని చెప్పాలి.

అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus