సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకోని తమిళ ప్రజలు లేరు. ‘దేవుడు శాసిస్తే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని.. అయితే పదవుల పై వ్యామోహం తో కాదని.. ప్రజలకు మంచి చెయ్యడానికి అది సువర్ణావకాశం అనిపించిన రోజున వెనకడుగు వెయ్యనని’ ఆయన మొదట్లో చెప్పేవారు. అనుకున్నట్టు గానే 2017లో ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. దాంతో ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ రజినీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. మొత్తానికి ఆయన సొంత పార్టీ పెట్టడానికి రెడీ అయినట్టు కూడా 2ఏళ్ళ క్రితం ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
2020 డిసెంబర్ 31న అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానని కూడా ఆయన తెలిపారు. కానీ అనుకోకుండా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ వచ్చారు. కొంచెం బెటర్ అయిన తరువాత డిశ్చార్జ్ అయిన రజినీ తిరిగి చెన్నై వెళ్లిపోయారు. అటు తరువాత ‘తాను రాజకీయాల్లోకి రావడం దేవుడికి ఇష్టం లేదని’ చెప్పి అందుకు తన ఆరోగ్యపరిస్థితిని ఉదాహరణగా చెప్పారు. రజినీ నిర్ణయం వెనుక ఆయన స్నేహితులు చిరంజీవి,మోహన్ బాబు లు ఉన్నారనేది ఇన్సైడ్ టాక్.
హైదరాబాద్ లో రజినీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న తరుణంలో చిరు, మోహన్ బాబులు ఆయన్ని కలిసి రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని బ్రెయిన్ వాష్ చేశారట. ‘ఓపిక ఉన్నంత వరకూ సినిమాలు చేసుకోవడమే మంచిదని.. రాజకీయాలు కుదురుగా ఉండనివ్వవని’ వారు రజినీకి తెలిపారట. రాజకీయాలకు రజనీ దూరంగా ఉండాలని డిసైడ్ అవ్వడం వెనుక చిరు,మోహన్ బాబు ల పాత్ర ఉందనే విషయం ఎలా ఉన్నా.. రజినీ అభిమానులు మాత్రం చాలా డిజప్పాయింట్ అయ్యారనే చెప్పాలి.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!