స్నేహితులతో కాదు…కుటుంభంతో చూడండి!!!

2017…టాలీవుడ్ కు మంచి శుభారంభం దొరికింది…మెగాస్టార్ రీ ఎంట్రీ….సెకెండ్ ఇన్నింగ్స్ మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ కి మంచి కలెక్షన్స్ ను అందిస్తుంది…ఇక అదే క్రమంలో ఒక్క రోజు తరువాత కాస్త తక్కువ థియేటర్స్ లో బరిలోకి దిగిన నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం “శాతకర్ణి” రికార్డుల దిశగా దూసుకుపోతు మనం మరచిన మన చరిత్రని మనకి మళ్ళీ అందంగా చూపిస్తుంది….అయితే ఈ బడా సినిమాలు ఎలా ఉన్నా…మరో చిన్న సినిమా…అందరూ చూడాల్సిన, సినిమా మరొకటి “శతమానం భవతి”. ఈ సినిమా ఆ రెండు సినిమాల మధ్య పడి నలిగిపోతుండేమో అని అందరూ అనుకున్నారు కానీ….ఇది చాలా మంచి చిత్రంగా అతి తక్కువ స్క్రీన్స్ లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది….అయితే ఈ సినిమా గురించి..ఈ సినిమాను చూసిన ఒక అభిమాని ఒక మంచి పోస్ట్ పెట్టాడు….ఇప్పుడు ఆ పోస్ట్ ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తుంది…ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి….ఆ అభిమాని ఏమని పెట్టాడు అంటే….”శతమానం భవతి అంత గొప్ప చిత్రం మళ్ళీ ఇప్పట్లో చూస్తాననే నమ్మకం లేదు.

ప్రతి కొడుకు, కూతురు, అన్నా, తమ్ముడు, అక్క, మనుమడు, మనుమరాలు, భార్య, భర్త, అమ్మా, నాన్న చూసి తీరాల్సిన సినిమా ఇది. ఈ సినిమాని మిగతా వాటితో పోల్చుకోవడం అనవసరం. ఈ సినిమాకి పోటీ లేదు. ఈ సినిమాలో ఫలనాది బాగుంది అనటానికి లేదు. సినీ పరిభాషలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నింటా శిఖరాగ్రంలో ఉందీ సినిమా. సినిమా అయిపోయాక కూడా ఎవరూ సీటుల్లో నుంచి లేవలేకపోతున్నారు. ఒక్క బండరాళ్లను తప్ప ప్రతి హృదయాన్ని స్పృశించే మలయమారుతం ఈ చిత్రం. ఈ సినిమాలో మనకి మనం కనపడతాము. మన పిల్లలు, మన అమ్మానాన్నలు కనపడతారు. చివరగా దయచేసి ఈ సినిమాను స్నేహితులతో కాదు. కుటుంబంతో మాత్రమే కలిసి చూడండి. అవకాశం ఉంటే అమ్మా,నాన్నలను తప్పక తీసుకువెళ్లండి…” అంటూ తనలోనూ ఫీలింగ్స్ ను ఇలా పోస్ట్ రూపంలో చూపించాడు…మొత్తంగా ఈ సినిమా అతన్ని అంతలా ఇంప్రెస్ చేసిందన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus