గీతా ఆర్ట్స్‌ మల్టీస్టారర్‌ ఇక లేనట్టే… కారణం ఏంటంటే?

కమెడియన్లు మిమ్మల్ని బాగా నవ్వించే సినిమా చూసి ఎన్ని రోజులు అయ్యింది అంటే కచ్చితంగా కాసేపు ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అదేంటి కామెడీ సినిమాల రావడం లేదు, చాలానే వస్తున్నాయి కదా అని అనొచ్చు. బాగా నవ్వించే సినిమాలు వస్తున్నాయి కానీ… కేవలం కమెడియన్లు మాత్రమే నవ్వించిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. ఆ మధ్య ‘జాతిరత్నాలు’ సినిమా వచ్చినా… అది హీరో నేపథ్యంలోనే సాగింది. కేవలం కమెడియన్లు కలసి చేసిన సినిమా ఈ మధ్య రాలేదు.

ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా? మనం ఇటీవల ఓ మాంచి కమెడియన్ల మల్టీస్టారర్‌ సినిమాను మిస్‌ అయ్యాం కాబట్టి. అవును ఇదేదో పుకారు కాదు. ఆ సినిమా చేద్దాం అనుకుని మిస్‌ అయిన దర్శకుడు చెప్పిన మాటే ఇది. (Vennela Kishore) వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ లాంటి స్టార్‌ కమెడియన్లతో ఓ సినిమా చేయాలని అనుకున్నానని దర్శకుడు వీఐ ఆనంద్‌ చెప్పారు. అయితే ఆ సినిమా డేట్స్‌ సమస్య వల్ల అవ్వలేదు అని చెప్పారు.

గతంలో బ్రహ్మానందం, బాబూమోహన్‌, కోట శ్రీనివాసరావు… ఇలా అగర కమెడియన్లు కలసి సినిమాలు చేసేవారు. అందులో ఇంకో హీరో అనేవాడే ఉండేవారు కాదు. మొత్తంగా ఆ కమెడియన్లే హ్యాండిల్‌ చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి కథలు, ఆలోచనలే మన దగ్గర రావడం లేదు. ఈ సమయంలో ఆలోచన చేసిన వీఐ ఆనంద్‌ ఈ పనిని పూర్తి చేయలేకపోయారు. దీంతో మనం మంచి కామెడీ మల్టీస్టారర్‌ మిస్‌ అయ్యాం అని చెప్పొచ్చు.

ప్రస్తుతం ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న వీఐ ఆనంద్‌… త్వరలో నిఖిల్‌ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేస్తారట.. దాంతోపాటు ఓ అగ్ర హీరోతో యాక్షన్‌ సినిమా కూడా ఆలోచనలో ఉంది అని చెప్పారు. గతంలో అల్లు అర్జున్‌తో ఆనంద్ ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. అయితే కథ కారణంగా ఆ సినిమా ఓకే అవ్వలేదు అని ఆనంద్‌ చెప్పారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus