యథార్థ ఘటనల ఆధారంగా రాబోతోన్న వీకెండ్ పార్టీ

ప్రస్తుతం ఆడియెన్స్ సినిమాలను చూసే ధోరణి మారిపోయింది. రియాలిటీ చిత్రాలను, రియలిస్టిక్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజ జీవితంలోని ఘటనలు, యథార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇక ఇప్పుడు నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఓ చిత్రం రాబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

వీకెండ్ పార్టీ ( A Small Journey) కథారచయిత అమరుడు డాక్టర్ బోయ జంగయ్య గారి 80వ జయంతి సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాత బోయ చేతన్ బాబు, సినిమా దర్శకులు అమరేందర్ ప్రోమో విడుదల చేశారు. నాగార్జునసాగర్ లో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా, ఈ సినిమా కొనసాగుతూ ఉంటుందని మేకర్లు తెలిపారు.

ఈ సినిమాలో ప్రధాన పాత్ర లో బాహుబలి ప్రభాకర్, గీతా సింగ్, గుంటూరు విజయ్, అక్షిత్ అంగరీష్, రమ్య నాని, రమ్య రాజ్, సిరి, గీతిక, ప్రధాన పాత్రలో నటించారు. హరిశ్చంద్ర, డి. డి శ్రీనివాస్, కిట్టయ్య, శరత్ కుమార్, లలిత రాజ్, జయ నాయుడు, శ్రీమణి నటీనటులు ఈ చిత్రంలో నటించారు.

ఈ సినిమాకు చంద్రబోస్, కాసర్ల శ్యామ్, సదా చంద్ర వంటివారు పాటలు రచించారు. సదా చంద్ర సంగీతాన్ని అందించారు. రామ్ అద్దంకి సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. వెంకట్ వేముల, ఆనంద్ సాయి, ఎడిటర్‌లుగా, లక్ష్మణ్ పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus