మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు అని అనౌన్స్మెంట్ రాగానే కచ్చితంగా ఆ చిత్రం ‘గీత ఆర్ట్స్’ సంస్థలోనే ఉంటుందని అంతా భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రాంచరణ్ సీన్లోకి ఎంటర్ అయ్యి ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై చేస్తున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో భారీ లాభాలు అందుకున్న చరణ్.. ఆ తరువాత భారీ బడ్జెట్ తో ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మించి.. నష్టాలు చవి చూసాడు. ఆ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చెయ్యకపోవడం వల్లే అలా నష్టాలు వాటిల్లినట్టు అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. అదే చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్’ లో చేసి ఉంటే మరో రేంజ్లో ఉండేదనే కామెంట్స్ కూడా వినిపించాయి.
పోనీ తరువాతి చిత్రమైనా ‘గీత ఆర్ట్స్’ లో చేస్తారేమో అనుకుంటే.. అది కూడా తీసుకెళ్లి ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ వారికి అప్పగించి.. వారు కూడా సహనిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. అసలు ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో మెగాస్టార్ ఎందుకు సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు అనేది అంతు చిక్కని ప్రశ్న. ఇప్పుడు తరువాతి చిత్రాన్ని కూడా ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. దీనికి బాబీ డైరెక్ట్ చేయబోతున్నాడట. మరి అల్లు అరవింద్ కు.. చిరు ఎప్పుడు సినిమా చేసి పెడతారో చూడాలి..!
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్