మహేష్ ఎందుకు సినిమా క్యాన్సిల్ చేశాడు

2019లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అని “రంగస్థలం” గ్రాండ్ సక్సెస్ తర్వాత మహేష్ బాబుతో సినిమాని చాలా గ్రాండ్ గా ఎనౌన్స్ చేసిన సుకుమార్.. మహేష్ బాబు చేత కథను ఒకే చేయించుకోలేక ఆ ప్రొజెక్ట్ ను క్యాన్సిల్ చేసి సింపుల్ గా బన్నీతో నా తదుపరి సినిమా అని మళ్ళీ కొత్త ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ.. అసలు మహేష్ బాబు సినిమా ఎందుకు క్యాన్సిల్ చేశాడు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

“రంగస్థలం” రిలీజ్ తర్వాత తన డెసిషన్ మేకింగ్ మీద సుకుమార్ కి అతి నమ్మకం ఎక్కువైందని, ఎవరైనా సజెషన్స్ ఇస్తుంటే తీసుకోవడం లేదని, మహేష్ బాబు సినిమా విషయంలో కూడా అదే జరిగిందని, మహేష్ ఎంత చెప్పినా కూడా హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో సుకుమార్ ఛేంజస్ చేయడానికి ఇష్టపడకపోవడంతో మహేష్ బాబు సైలెంట్ గా తప్పుకున్నాడు. మళ్ళీ తన మీద నెగిటివిటీ రాకుండా సుకుమార్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ సైడైపోయాడు.పోనీ ఎనౌన్స్ అయ్యింది కాబట్టి అల్లు అర్జున్ తో అయినా సినిమా కన్ఫర్మ్ అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి కనీసం ఏడెనిమిది నెలలు అవుతుంది. మరి అప్పటివరకూ సుకుమార్ ఏం చేస్తాడు? అనేది పెద్ద ప్రశ్న. పోనీ వీళ్ళు కాకుండా వేరే హీరోలు లేరా అంటే అదీ కాదు… సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. మరి వాళ్లందరినీ కాదనుకొని బిజీగా ఉన్న అల్లు అర్జున్ తో ప్రొజెక్ట్ ఎనౌన్స్ చేయడం వెనుక సుకుమార్ ఆంతర్యం ఏమిటనేది ప్రస్తుతం ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus