పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కటౌట్ ‘బాహుబలి’ కి ఎలా ఉండేదో.. ‘బాహుబలి’ కి ముందు ఎలా ఉండేదో అందరికీ తెలుసు. అసలు హీరో అంటే ఇలా కదా ఉండాల్సింది అనే రేంజ్లో ఉండేది. కానీ ‘బాహుబలి’ వల్ల ఫిట్నెస్ మొత్తం పోగొట్టుకున్నట్టు అయ్యింది. ఆ సినిమా తెచ్చిన ఇమేజ్ కారణంగా ప్రభాస్ పెద్ద ప్రాజెక్టులు ఒప్పుకోవాల్సి వచ్చింది. వాటిని కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఒకప్పటిలా జిమ్లో వర్కౌట్లు చేయడం వంటివి మానేశాడు.
పైగా ఫుడీ కూడా కావడం వల్లేమో షేపౌట్ అయిపోయాడు. ‘ది రాజాసాబ్’ కోసం స్లిమ్ అయినప్పటికీ.. మునుపటి కళ అయితే ఫేస్లో లేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ కి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ అంటే అతని బేస్ వాయిస్ అనే చెప్పాలి. అతను కోపంగా డైలాగ్ చెబుతుంటే చాలా గంభీరంగా అనిపిస్తుంది. అతని కటౌట్ కి తగ్గ వాయిస్ అనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య పలు సినిమాల్లో ప్రభాస్ వాయిస్ కోసం ఏఐ వాడుతున్నారు.
‘మిరాయ్’ లో ఏఐ వాడారు. ఇటీవల వచ్చిన ‘స్పిరిట్’ ఆడియో ఫైల్ లో కూడా ప్రభాస్ వాయిస్ కోసం ఏ ఐ వాడటం అందరికీ షాకిచ్చింది. చిన్న డైలాగ్ కి ఏఐ వాడాల్సిన అవసరం ఏముంది అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ వాయిస్ ను గమనిస్తే.. సందీప్ ఏఐ ఎందుకు వాడాడు అనే క్లారిటీ అందరికీ వచ్చేస్తుంది. ‘బాహుబలి ది ఎపిక్’ రిలీజ్ కోసం ప్రభాస్,రానా, దర్శకుడు రాజమౌళి ఓ ఫన్నీ చిట్ చాట్లో పాల్గొన్నారు. ఇందులో ప్రభాస్ వాయిస్ చాలా బొంగురుగా ఉంది. బహుశా వాతావరణ మార్పుల వల్ల కావచ్చు.