పక్కింటి కుర్రాడు ఇమేజ్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఏ సినిమా చేసినా… మనోడు చేసిన సినిమా అనిపించుకోవడం ఏ హీరోకీ అంత ఈజీ కాదు. చేసిన ప్రతి సినిమాకు కొత్తదనం చూపించడం చూపించడం ఇంకా ఈజీ కాదు. కానీ ఇవన్నీ వరుసగా చేస్తూ నాని… నేచురల్ స్టార్ నాని అయ్యాడు. కానీ రీసెంట్‌గా నానిలో నేచురల్‌గా వచ్చిన లక్షణం… తగ్గిపోతోందా? సినిమా కథల్ని సరిగ్గా జడ్జి చేయలేకపోతున్నాడా? ఈ ప్రశ్నలన్నిటినీ అడిగిస్తోంది ఆయన తాజా సినిమా ‘టక్ జగదీష్’ ఫలితం.
నాని వరుస సినిమాలు చేస్తున్నప్పుడు, అవి విజయాలు సాధిస్తున్నప్పుడు అందరూ తెగ మెచ్చుకున్నారు. ఇలా కథల్ని వేగంగా ఎలా ఎంపిక చేసుకుంటున్నాడు, అందులోనూ అన్నీ విజయాల్ని ఇచ్చేవే అని కుర్ర హీరోలు, పెద్ద హీరోలు అనుకునేవారని టాక్. కానీ గత నాలుగేళ్లుగా చూస్తే నాని మేజిక్ తగ్గుతోంది. మంచి సినిమాల్ని వదులుకొని, ఫ్లాప్ సినిమాల్ని, పెద్దగా ఉపయోగం లేని సినిమాల్ని చేస్తున్నాడు అనిపిస్తోంది. ఒకసారి కావాలంటే నాని ఫిల్మోగ్రఫీ చూడండి మీకే తెలుస్తుంది.
‘ఎంసీఏ’ సినిమా ఫర్వాలేదనపించినా… నాని చేయాల్సిన సినిమా కాదు, ఆయన స్థాయి విజయం కాదు అనే టాక్ వినిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ దారుణంగా బోల్తా కొట్టాయి. ‘జెర్సీ’ సినిమాతో మంచి పేరు వచ్చినా… వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదంటారు. ‘గ్యాంగ్ లీడర్’ ప్రయోగంలా మారిపోయిందంతే. ఇక గతేడాది వచ్చిన ‘వి’ గురించి చెప్పుకోకపోవడం మంచిది. ఇక ‘టక్ జగదీష్’ అంటారా? ఆఁ… చెప్పండి ఇంకేంటి సంగతులు. సో విషయం అర్థమైందిగా… ‘నాని… ఏమైంది నాని’ అని అనుకోవడం ఒక్కటే మార్గం.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!