Prasanth Varma: ప్రభాస్‌ టెస్ట్‌ లుక్‌ డన్‌: ప్రశాంత్‌ వర్మ ప్రాజెక్ట్‌ ఎందుకు చేతులు మారింది?

ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇలా అనౌన్స్‌ అయి, అలా ఆగిపోయిన ప్రాజెక్ట్‌ ఏదన్నా ఉందా అంటే ‘బ్రహ్మరాక్షస’ అని చెప్పొచ్చు. ఇండియన్‌ సినిమాలో లైవ్‌ వైర్‌ అనే పేరున్న రణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh) – తెలుగు సినిమాలో సరికొత్త హిట్‌ మెషీన్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma)   కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా అది. పుకార్లతో మొదలైన ఈ ప్రాజెక్ట్‌.. వెంటనే కొద్ది రోజులకు అలాంటిదేమీ లేదు అని అనౌన్స్‌మెంట్‌తో డౌట్‌లో పడింది. అక్కడికి కొద్ది రోజులకే సినిమా అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే సినిమా లేదని అనౌన్స్‌ చేశారు.

Prasanth Varma

ఇలా సినిమా పుకార్ల నుండి క్లారిటీ వరకు అనౌక డౌట్స్‌కి నెలవైన ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కొత్త పుకారు ఒకటి బయటికొచ్చింది. అదే ఈ సినిమాకు సంబంధించి లుక్‌ టెస్ట్‌ జరుగుతోంది అని. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) మీద ఈ ప్రాజెక్ట్‌ లుక్‌ టెస్ట్‌ జరిగిందని నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. మరికొందరేమో ఈ రోజు జరుగుతుంది అని చెబుతున్నారు. ఈ విషయంలో ఈ రోజు క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ డౌట్‌ ఏంటంటే.. సినిమా నిర్మాతలు మారారట. లైన్‌లో హోంబలే ఫిల్మ్స్‌ వాళ్లు వచ్చారట.

రణ్‌వీర్‌ సింగ్‌తో సినిమా అనుకున్నప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తామని చెప్పారు. అయితే అప్పుడు క్రియేటివ్‌ డిఫరెన్స్‌ల వల్ల ఆ సినిమా ఆగిపోయింది అని చెప్పారు. ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా అనేసరికి హోంబలే ఫిల్మ్స్‌ వాళ్లు నిర్మిస్తారు అని చెబుతున్నారు. అంటే రణ్‌వీర్‌తో సినిమా అనుకున్నప్పుడు సమస్య వచ్చింది హీరో– దర్శకుడికి కాదన్నమాట. హీరోకి, నిర్మాతలకు అన్నమాట. లేదంటే ప్రభాస్‌ సినిమాను మైత్రీ వాళ్లే చేసేవాళ్లుగా.

ఒకవేళ మైత్రీ వాళ్లకు ప్రశాంత్‌ వర్మకు సమస్య అనుకుంటే.. ‘జై హనుమాన్‌’ సినిమా ఆ బ్యానర్‌లోనే చేస్తున్నారు ప్రశాంత్‌. కాబట్టి సమస్య రణ్‌వీర్‌కు మైత్రీ వాళ్లకు అని చెప్పాలి. ఏమో ఈ విషయంలో క్లారిటీ ఎవరిస్తారో చూడాలి. అయితే ఇక్కడో డౌట్ ఏంటంటే.. ఈ సినిమా ఓకే అనుకుంటే ప్రభాస్‌ ఎప్పుడు డేట్స్‌ ఇస్తారు. ఎందుకంటే ఆయన చేతిలో ‘కల్కి 2’, ‘సలార్‌ 2’, ‘ది రాజాసాబ్‌’ (The Raja saab), ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌), ‘స్పిరిట్‌’ (Spirit) ఉన్నాయి. కాబట్టి ప్రశాంత్‌ వర్మకు ఇప్పట్లో డేట్స్‌ కష్టమే.

డైరక్టర్‌ని పట్టించుకోరేం.. సందీప్‌ వంగా పాయింట్‌ కరెక్టేగా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus