Arohi, Surya: సమ్ థింగ్ సమ్ థింగ్ అంటున్న ఆరోహి – ఆర్జే సూర్య..! హౌస్ లో జరుగుతోంది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్రెండ్స్ గా వెళ్లిన ఆరోహి ఇంకా ఆర్జే సూర్య ఇద్దరూ కొద్దిగా శృతిమించుతున్నట్లుగానే అనిపిస్తోంది. బయట మూడేళ్లుగా కలిసి స్కిట్స్ చేస్తున్నాం, కలిసి వర్క్ చేస్తున్నాం అప్పుడు పుట్టలేదు కానీ, ఇప్పుడు ప్రేమ పుడుతుందా అని ఆరోహి స్ట్రయిట్ గానే చెప్పింది. నాగార్జున వీకండ్ ఎపిసోడ్ లో ఆరోహిని ఆడియన్స్ అడిగిన ప్రశ్నకి రియాక్ట్ అయ్యింది. ఇక ఆడియన్స్ అయితే, వీళ్లిద్దరి మద్యలో సమ్ థింగ్ ఏదో ఉందని స్ట్రయిట్ గానే చెప్పారు.

అయితే, కొంతమంది మాత్రం కావాలనే కంటెంట్ ఇస్తున్నారు అంటూ మాట్లాడారు. కంటెంట్ ఇచ్చినా కలరింగ్ ఇచ్చినా రాత్రిపూట ఫుడ్ చేసిపెట్టడం, నుదిటి మీద ముద్దు పెట్టడం, దగ్గరకి తీస్కుని మరీ ఓదార్చడం ఇవన్నీ ఫ్రెండ్షిప్ కాదని, అంతకుమించి ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అప్పుడు ఆరోహికి ఆర్జే సూర్య పాయింట్స్ అందించడం, అలాగే టాస్క్ లో ఇద్దరూ కలిసి ఆడటం, ఒకరికొకరు హెల్ప్ చేస్కోవడం చేస్తున్నారు.

ఇక ఒకరినొకరు నామినేట్ చేస్కోవడం అనేది అస్సలు జరగని పని. గేమ్ ఎలా ఆడాలి ? ఎలా ఉంటే హైలెట్ అవుతామ్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చారా అనే సందేహాలు ఇప్పుడు అందరికీ కలుగుతున్నాయి. మార్నింగ్ బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరి మద్యలో చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. ఇద్దరూ కొట్టుకుంటున్నారు కూడా. అలాగే ఆరోహి ఏడుస్తుంటే ఆర్జే సూర్య ఓదార్చడం, మళ్లీ ఒకరిపై ఒకరు అలగడం, సారీలు చెప్పుకోవడం చేస్తున్నారు.

వీళ్లిద్దరినీ చూస్తున్న ఆడియన్స్ ఫ్రెండ్స్ గా అయితే లేరు అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతున్నారు. అంతేకాదు, వీకండ్ నాగార్జున వీరిద్దరి ఫోటో చూపించిన దగ్గర్నుంచీ హౌస్ మేట్స్ కూడా వీరిద్దరిపై కన్నేశారు. శ్రీసత్య అయితే ఏమో మీ ఇష్టం అంటూ మాట్లాడుతూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇద్దరి మద్యలో ఏదో ఉందని, సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ శ్రీసత్య స్ట్రయిట్ గానే చెప్పింది. మరి వీరిద్దరి జెర్నీ బిగ్ బాస్ సీజన్ 6లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus