Pooja Hegde: రూల్స్‌ మాట్లాడుతున్న పూజా హెగ్డే.. బాగా కోపం వచ్చినట్లుందే?

ఒకప్పుడు ఐరెన్‌ లెగ్‌ అనే అవసరం లేని ట్యాగ్‌లైన్‌తో కెరీర్‌ ఎర్లీ డేస్‌ను నడిపించిన పూజా హెగ్డే (Pooja Hegde).. ఆ తర్వాత అనూహ్యంగా గోల్డెన్ లెగ్‌ అయిపోయింది. వరుస సినిమాలు ఓకే చేస్తూ వచ్చింది. అయితే అందులో విజయాల శాతం తగ్గడం, ఆఖరికి ఆగిపోవడంతో మళ్లీ ఐరెన్‌ లెగ్‌ అనే బిరుదు వచ్చేసింది. ఆ బిరుదుతోనే ఇప్పుడు కొత్త సినిమాలు చేస్తోంది. వాటి ఫలితం బట్టి మళ్లీ ఆమె ట్యాగ్‌ మారుతుంది అనుకోండి. ఆ విషయం వదిలేస్తే ఆమెను ఇటీవల ఓ సినిమాకు తీసుకున్నట్లే తీసుకొని మళ్లీ నో అన్నారట.

Pooja Hegde

ఆ విషయాన్ని చెప్పిన పూజా హెగ్డే.. అక్కడితో ఆగకుండా సినిమాలకు సంబంధించి కొన్ని రూల్స్‌ కూడా మాట్లాడింది. ప్రస్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న పూజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలో హీరోయిన్స్‌కు ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు ఇస్తున్నారని కామెంట్‌ చేసింది. అంతేకాదు సినిమాలోకి తీసుకోవడానికి హీరోయిన్లకు పక్కాగా ఆడిషన్‌ చేస్తే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి అని చెప్పింది.

దర్శక నిర్మాతలు త్వరగా నటీనటులపై ఓ అభిప్రాయానికి వచ్చేస్తారు. వీరు ఈ పాత్రలకే సరిపోతారు అనే భావనకు వచ్చేస్తారు. హీరోయిన్స్‌ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాత్రను రాసినప్పుడు దానికి వారు అనుకున్న నటి సరిపోతారు అని ఫిక్స్‌ అయిపోతారు. వాళ్లను ఆడిషన్‌ కూడా చేయకుండా సినిమాలోకి తీసుకుంటారు అని అంది పూజా. ప్రతి సినిమాకు ఆడిషన్‌ ముఖ్యమని, అయితే ఈ పరిస్థితి కొన్ని ఇండస్ట్రీల్లోనే ఉంది అని చెప్పింది.

ఈ మాట ఆమె అనడానికి కారణం ఇటీవల ఆమెకు ఎదురైన ఓ అనుభూతినే. ఇటీవల పూజా హెగ్డే ఓ తమిళ సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లిందట. ఆ పాత్రకు తన వయసు తక్కువగా అని భావించి నో చెప్పారట. ఆ తర్వాత తన కంటే వయసు పెద్ద అయిన ఓ హీరోయిన్‌ని ఓకే చేశారట. సినిమాలోకి తీసుకున్న తర్వాత ఆ పాత్రకు సరిపోలేదని తిరస్కరించే బదులు.. ఇలా ముందే ఆడిషన్‌ చేయడం బాగుంది అని చెబుతోంది పూజ. ఇదంతా ఓకే కానీ.. పూజకు నో చెప్పిన ఆ సినిమా ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus