Manchu Lakshmi, Rakul Preet: లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్..ల లేటెస్ట్ వీడియో వైరల్!

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘కెరటం’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత వచ్చిన ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో  (Venkatadri Express) ప్రేక్షకాదరణ పొందింది. ఆ సినిమా తర్వాత వరుసగా ‘లౌక్యం'(Loukyam) ‘పండగ చేస్కో’ (Pandaga Chesko) ‘కిక్ 2’ (Kick 2) ‘బ్రూస్ లీ’ (Bruce Lee)  ‘సరైనోడు’ (Sarrainodu) ‘స్పైడర్’ (Spyder) ‘ధృవ’ (Dhruva)  వంటి పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈమెకు తెలుగులో సరైన సినిమా అవకాశాలు లేవు.

Manchu Lakshmi, Rakul Preet

తమిళంలో ‘అయలాన్’ (Ayalaan) ‘ఇండియన్ 2’ (Indian 2)  వంటి పెద్ద ఆఫర్లు పట్టింది. హిందీలో కూడా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుంది. కానీ ఒకప్పటి హవా అయితే లేదు అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే మంచు లక్ష్మీ (Manchu Lakshmi) అనే చెప్పాలి. 2014 లో వచ్చిన ‘కరెంటు తీగ’ (Current Theega) సినిమా నుండి మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్..ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇప్పుడైతే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.

తాజాగా మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్..లు ముంబైలో దర్శనమిచ్చారు. వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ నుండి ఒక చిన్న కాఫీ షాప్ కి వెళ్లి బయటకు వచ్చారు. వెంటనే పాపరాజీ బ్యాచ్ కెమెరాలతో అక్కడికి చేరుకున్నారు. వాళ్లకి అవసరమైన ఫోజులు ఇచ్చేసి.. ఆ తర్వాత ఎవరి కారు వద్దకి వాళ్ళు వెళ్లిపోయారు. ఈ క్రమంలో వీళ్ళు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని తమ బాండింగ్ ఎలాంటిది అనేది చాటుకున్నారు. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

నాగార్జున, బాలకృష్ణ..ల వింటేజ్ పిక్ వైరల్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus