ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా వచ్చింది. దానికి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్ట్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’ కి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దానికి కూడా మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అయితే ఓటీటీలో దానికి నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో.. ‘దేవర 2’ ఉండదు అని అంతా అభిప్రాయపడ్డారు.
దానికి తోడు ‘దేవర 2’ షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో.. ఇక అది ఉండదు అని కూడా చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ అనుమానాలు అన్నీ తాజాగా ఎన్టీఆర్ పటాపంచలు చేశాడు. ‘మ్యాడ్ 2’ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… “దేవర చిత్రాన్ని ఆదరించినందుకు మీ భుజాలపైన ఆ సినిమాని మోసినందుకు ధన్యవాదాలు. ఇక ‘దేవర 2’ లేదు అని అంటున్న వాళ్లందరికీ చెబుతున్నాను.
‘దేవర 2’ ఉంటుంది కచ్చితంగా కచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి” అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ‘దేవర 2’ పై వస్తున్న రూమర్స్ అన్నిటికీ ఎన్టీఆర్ చెక్ పెట్టినట్లు అయ్యింది. అలాగే ఎన్టీఆర్ కూడా చాలా క్లారిటీతో ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ ఆగస్టులో రిలీజ్ అవుతుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ 2026 సంక్రాంతికి అనౌన్స్ చేశారు. కానీ అది సమ్మర్ లేదా సెకండాఫ్లో వచ్చే అవకాశం ఉంది.