దివ్య భారతి (Divyabharathi) తమిళమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘మహారాజా’ (Maharaja) సినిమాలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) భార్య పాత్రలో నటించింది. అందులో చిన్న పాత్రే అయినప్పటికీ ఆడియన్స్ అందరికీ బాగా నోటీస్ అయ్యింది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తెరకెక్కిన ‘గోట్’ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. తమిళంలో అడపా దడపా సినిమాల్లో నటిస్తోంది. మరోపక్క వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. పెళ్ళైన వ్యక్తితో ఈమె ఎఫైర్ పెట్టుకున్నట్లు టాక్ నడుస్తుంది. విషయంలోకి వెళితే..సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ తో (G. V. Prakash Kumar) ఈమె డేటింగ్లో ఉన్నట్టు టాక్ నడిచింది.’బ్యాచిలర్’ ‘కింగ్స్టన్’ (Kingston) వంటి సినిమాల్లో అతనితో కలిసి నటించింది. అప్పటి నుండి ఈ ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈమె కారణంగానే జీవి ప్రకాష్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్నట్లు కూడా టాక్ నడుస్తుంది.
తాజాగా ఆ ప్రచారం పై స్పందించి షాకిచ్చింది దివ్య భారతి. ఆమె ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. “నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. మెయిన్ గా పెళ్లి అయిన వ్యక్తితో డేటింగ్ చేయడం ఏంటి… నాన్సెన్స్. ప్రూఫ్స్ లేకుండా ఇలాంటి పనికిమాలిన వార్తలు ప్రచారం చేయకండి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాను. నా మౌనాన్ని చేతకానితనంగా భావించి హద్దులు మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్” అంటూ ఘాటుగానే స్పందించింది.