తెలుగు దర్శకుల తెలుగు సినిమా ఏంటి అడ్డంకి

  • May 17, 2021 / 08:04 PM IST

ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశం వెతుక్కుంటూ వస్తుంది అంటుంటారు మన పెద్దలు. అయితే దాంతోపాటు చిన్నపాటి అదృష్టమో, ఇంకేదో కూడా ఉండాలి అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సినిమా పరిశ్రమలో చాలామందిని చూసేటప్పుడు ఈ మాట కచ్చితంగా అనాలనిపిస్తోంది. అలాంటివారిలో రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే జోడీ ఒకటి. ఇలా చెబితే పెద్దగా అర్థం కాకపోవచ్చు కానీ… రాజ్‌ అండ్‌ డీకే అంటే అర్థమైపోతుంది. వాళ్ల గురించి మేం ప్రతిభ, అదృష్టం అని మాట్లాడుతోంది.

18 ఏళ్ల క్రితం ‘ఫ్లేవర్స్‌’ అనే సినిమాతో తమ ప్రయాణం ప్రారంభించారీ స్నేహితులు. ఆ తర్వాత ఆరేళ్లకు ‘99’ అనే సినిమాతో వచ్చారు. ఈ రెండూ మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వా ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’, ‘గో గోవా గాన్‌’ చేశారు. ఇవన్నీ మంచి పేరు తెచ్చాయి. దీంతో 2013లో ‘డి ఫర్‌ దోపిడీ’ అనే సినిమాను తెలుగులో నిర్మించారు. దీంతో హమ్మయ్య తెలుగు కుర్రాళ్లు తెలుగులోకి వచ్చారు అనుకున్నాం. అయితే ఆ సినిమా తేడా కొట్టేయడంతో మళ్లీ ఇటు రాలేదు.

‘..దోపిడీ’ తర్వాత రాజ్‌ డీకే ఒకటి రెండు సినిమాలు చేసినా, పేరొచ్చింది మాత్రం ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీస్‌తోనే. తొలి సిరీస్‌ ఇచ్చిన విజయం ఊపుతో రెండోది కూడా తీసేశారు. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా రిలీజ్‌ అవ్వడం లేదు. అయితే ఇంత ప్రతిభ ఉన్న వీళ్లు తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు. ఇదే అందరి ప్రశ్న. ఇదే మాట మొన్నీమధ్య వాళ్లిద్దరినీ అడిగితే మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ లాంటి వాళ్లకు కథలు చెప్పామని అంటున్నారు.

వీళ్లు కథలు చెప్పడం, హీరోలు వినడం వరకు ఓకే. కానీ ఎందుకు ‘రండి సినిమా చేద్దాం’ అని ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంట గెలిచి… రచ్చ గెలవమన్నారు. వీళ్లు రచ్చ గెలిచేశారు. ఇంక ఇంట గెలవాలి. గెలవాలంటే అవకాశం ఇవ్వాలి కదా. అయితే ఇక్కడో మాట, పెద్ద హీరోలు అయితే వీళ్లకు అవకాశం ఇవ్వాలి. వీళ్లు యంగ్‌ టాలెంట్‌తో ఇక్కడ సినిమా తీసి, హిట్‌ కొడదాం అంటే ఎవరు వద్దంటారు. సో రాజ్‌ అండ్‌ డీకే ఏదో ఒకటి చేయాలి మరి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus