Liger: ఈ మాటతో ఊదరగొట్టారు.. అర్థమేంటంటే!

సినిమా ప్రచారంలో.. ఆ సినిమాలోని మెయిన్‌ డైలాగ్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ‘తగ్గేదేలే / జూకేగా నహీ’ అనే డైలాగ్‌ ‘పుష్ప’ సినిమాకు ఎంతగా ఉపయోగపడిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అల్లు అర్జున్‌ ఎక్కడికి వెళ్లినా ఈ డైలాగ్‌ చెబుతున్నాడు. లేదంటే అక్కడివాళ్లు చెప్పమంటున్నారు. ఇప్పుడు విడుదలకు సిద్ధమైన ‘లైగర్‌’కి కూడా ఇలాంటి ఓ డైలాగ్‌ ఉంది. మీకు కూడా ఆ డైలాగ్‌ తెలిసే ఉంటుంది. అదే ‘వాట్‌ లగా దేంగే’. అసలు దీని అర్థం ఏంటి? ఎందుకు అంటున్నారు?

‘లైగర్‌’ సినిమా ప్రచారం మొదలైన కొత్తల్లో ఓసారి విజయ్‌ దేవరకొండ మాట్లాడినప్పుడు, ఆ తర్వాత నిర్మాత ఛార్మి మాట్లాడినప్పుడు ‘వాట్‌ లగా దేంగే’ అనే మాట వినిపించింది. ఈ మాట మొత్తం దేశంలో అందరికీ తెలుస్తుందా అంటే కష్టమే. కానీ క్యాచీగా ఉండేసరికి ఇప్పుడు లైగర్‌ ఫ్యాన్స్‌ అందరూ ఈ మాట వాడేస్తున్నారు. ఈ క్రమంలో దీని అర్థమేంటి అనేది చూస్తే.. అందరికీ తెలిసిన మాటే బయటికొచ్చింది. ‘వాట్ లగా దేంగే’ అనే మాటను ముంబయిలో విరివిగా వాడుతుంటారు.

‘లైగర్‌’ సినిమా కోర్‌ ముంబయిలోనే సాగుతుంది కాబట్టి. సినిమాలో ఆ మాట ఎక్కువగానే వాడుంటారు. ఈ మాటను తెలుగులో చెప్పాలంటే.. ఇరగొట్టడం, దుమ్మురేపడం లాంటి అర్థాలు వస్తాయి. అంటే సినిమా ఇరగొట్టిందిరా, హీరో దుమ్మురేపాడు అని అంటాం కదా.. అలా అన్నమాట. అయితే తెలుగులో ప్రచారం చేసినప్పుడు ఈ మాటే వాడొచ్చు కదా అంటే.. అవును వాడొచ్చు. కానీ కొత్తగా ఉంటుందని టీమ్‌ ‘వాట్‌ లగా దేంగే’ అంటున్నారు.

అయితే సినిమా టీమ్‌ మొత్తం ఈ మాటే అంటోందా? అంటే లేదనే చెప్పాలి. టాలీవుడ్‌లో జెండా పాతేద్దాం అనుకుంటున్న అనన్య పాండే అయితే.. తెలుగు ప్రాంతాలకు వెళ్తే తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. అంతేకాదు దర్శకుడు పూరి జగన్నాథ్‌ కూడా ‘మా సినిమా 25న వస్తోంది.. చూడండి’’ అని అంటున్నారు. కానీ విజయ్‌, ఛార్మి మాత్రం ఈ ‘వాట్‌’ లగా దేంగే వదలడం లేదు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus