అవసరాల, ఈషా రెబ్బా మధ్య ఉన్నదీ స్నేహమా? ప్రేమ ?

తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైన కాలం నాటి నుంచి హీరో, హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సందర్భాలే కాదు.. దర్శకుడు.. హీరోయిన్ ప్రేమలో పడి దంపతులు అయిన సందర్భాలు ఉన్నాయి. రోజా, కళ్యాణి తదితరులు కూడా డైరక్టర్స్ నే పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో జంట చేరబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గాసిప్ జోరుగా సాగుతోంది. నటుడిగా పరిచయమై దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ ను తెలంగాణ బ్యూటీ ఈషా రెబ్బా ప్రేమించిందని సమాచారం. అవసరాలకు కూడా ఈషా అంటే చాలా ఇష్టమని తెలిసింది. అయితే అవసరాల దర్శకత్వంలో ఈషా నటించలేదు.

పోనీ హీరో హీరోయిన్స్ రోల్ కూడా చేయలేదు. అయితే అమితుమీ సినిమాలో అవసరాల పాత్రకు కజిన్ సిస్టర్ రోల్ ని ఇషా పోషించింది. రీసెంట్ గా వచ్చిన “అ” చిత్రంలోనూ నటించారు. కానీ ఒకరికి మరొకరికి సంబంధం ఉండదు. ఈ చిత్రాల చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని.. అది ప్రేమగా మారిందని ఫిలిం నగరవాసులు చెబుతున్నారు. ఈ మధ్య ఇద్దరు కలిసి బయట తిరుగుతున్నారని, ఫంక్షన్స్ కి కలిసి వెళుతున్నట్టు చూసినవారు చెబుతున్నారు. అయితే ఈ రూమర్స్ పై అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా స్పందించలేదు. వారి వివరణ కోసం మీడియా ఎదురుచూస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus