టాలీవుడ్ లో ఒన్నాఫ్ ది బ్యాంకబుల్ హీరో స్థాయి నుంచి ఈ హీరోతో సినిమా అంటే లాసే అనే స్థాయికి దిగజారిపోయిన యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఒక భాష మీద పట్టు సాధించకుండానే పరాయి భాషలోనూ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నించడమే అతడి కెరీర్ పాలిట శాపంగా మారింది. “రన్” సినిమాతో మొదలైన సందీప్ కిషన్ ఫ్లాపుల పరంపర “నెక్స్ట్ ఏంటి” సినిమా వరకూ కొనసాగుతూనే ఉంది. సక్సెస్ ఫుల్ గా 4 హ్యాట్రిక్ ఫ్లాప్స్ సొంతం చేసుకున్నాడు సందీప్ కిషన్.
ఇప్పుడు కూడా సందీప్ చేతిలో ఓ రెండు సినిమాలున్నాయి. ఇండస్ట్రీలో మంచి పరిచయాలతోపాటు.. ఛోటా కె.నాయుడు బంధువు కావడం సందీప్ కిషన్ కి కలిసొచ్చే విషయమే అయినప్పటికీ.. అర్జెంట్ గా ఒక హిట్ కొట్టకపోతే మాత్రం మనోడ్ని జనాలు హీరోగా గుర్తించడం కూడా మానేస్తారు.
ప్రస్తుతం సందీప్ కిషన్ ఉన్న సిచ్యుయేషన్ కి సాధారణ హిట్ వచ్చినా ఫ్లాప్ కిందే లెక్క.. అందువల్ల మరీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా.. మినిమం బ్లాక్ బస్టర్ హిట్ లేదా సూపర్ హిట్ కొట్టాలి. మరి సందీప్ కిషన్ ఆ హిట్ కొట్టాలంటే అర్జెంట్ గా అతడి జీవితంలో ఒక అద్భుతం జరగాలి. ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందో.. సందీప్ మళ్ళీ మంచి హిట్ ఎప్పుడు కొడతాడో చూడాలి.