మహర్షి సక్సెస్ సెలబ్రేషన్స్ లో అల్లరి నరేష్ మిస్సింగ్

నిన్న విడుదలైన మహేష్ బాబు 25వ చిత్రం “మహర్షి”కి మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాల్లో 24.6 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి పర్వాలేదనిపించుకొంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని నిన్న రాత్రి మహర్షి & టీం పార్టీ చేసుకొన్నారు. హీరో మహేష్ బాబు, హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి. నిర్మాతలు మరియు సినిమాకి పనిచేసిన కీలకమైన టెక్నీషియన్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇంకో విశేషం ఏమిటంటే.. “డియర్ కామ్రేడ్” బృందం కూడా ఆ పార్టీలో పాల్గొన్నారు. నిన్న మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు కూడా కావడంతో విజయ్ తోపాటు మహేష్ బాబు నెక్స్ట్ సినిమా హీరోయిన్ అయిన రష్మిక మండన్నా కూడా ఈ పార్టీలో పాలుపంచుకొంది.

అంతా బాగానే ఉంది కానీ.. ఈ పార్టీలో అల్లరి నరేష్ లేకపోవడం మహేష్ అభిమానులను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. “మహర్షి” సాధించిన విజయంలో అల్లరి నరేష్ పోషించిన రవి పాత్ర చాలా కీలకం. అలాంటి రిషి జర్నీలో ముఖ్యుడైన రవి లేకుండా సక్సెస్ సెలబ్రేషన్స్ ఏంటని నిన్న నమ్రత ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పట్నుంచి.. ఫోటోల్లో అల్లరి నరేష్ ఎక్కడ, రవి ఎక్కడ అని అడగడం మొదలెట్టారు. ఇవాళ ఉదయం అల్లరి నరేష్ తన థ్యాంక్యూ పోస్ట్ ను సపరేట్ గా పెట్టడం కూడా లేనిపోని అనుమానాలకు తావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus