Janhvi Kapoor: జాన్వీనా… పూజానా… ‘మైత్రీ’ వాళ్లు ఏమన్నా క్లారిటీ ఇచ్చేస్తారా?

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) టాలీవుడ్‌ అరంగేట్రం అయిపోయింది. తారక్‌ (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమాతో జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే సినిమా ప్రచారం మొదలవ్వాల్సి ఉండగా… చిత్రీకరణ ఆలస్యం అవ్వడంతో రిలీజ్‌ వాయిదా వేశారు. ఇక రెండో సినిమా గురించి చర్చ మొలైంది. అయితే ఇటీవల ఆ సంగతి కూడా తేలిపోయింది. రామ్‌చరణ్‌ (Ram Charan) – బుచ్చిబాబు సానా (Buchi Babu Sana0 సినిమా ఓకే చేసేసింది. అయితే ఇప్పుడు చర్చ కోలీవుడ్‌ వైపు వెళ్లింది. అక్కడ తొలి సినిమా ఏది అనే చర్చ మొదలైంది.

అయితే, జాన్వీ కపూర్‌ తమిళ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి గత కొన్ని నెలలుగా రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. సూర్య (Suriya) సినిమాతో జాన్వీ ఎంట్రీ ఉంటుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు అజిత్‌ (Ajith) అని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అజిత్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు.

ఈ సినిమాకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో విషయం తెలిసింది. అజిత్ సరసన జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. అయితే మరోవైపు పూజా హెగ్డే పేరు కూడా అదే స్థాయిలో వినిపిస్తోంది. మైత్రీ టీమ్‌ తలుచుకుంటే… వీళ్లిద్దర్లో ఎవరినైనా ఓకే చేసేయగలదు. ఇదే సంస్థలో తెరకెక్కుతున్న ఆల్రెడీ చరణ్ సినిమా కోసం ఆమెనే తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో మరో సౌత్‌ సినిమా అంటే ఆమె ఓకే చేయొచ్చు. అందులో అజిత్‌తో సినిమా అంటే ఇంకా త్వరగా ఓకే చేస్తుంది. అందులో తన తల్లి (Sridevi) ఆఖరిగా నటించిన హిట్‌ సినిమా ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’లో అజిత్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాన్వీ ఓకే చేస్తుందా? లేక సరైన సౌత్‌ సినిమా వచ్చి చాలా రోజులైన పూజా హెగ్డేనే తీసుకుంటారా అనేది చూడాలి. ఈ విషయంలో ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus