బాలీవుడ్‌ మీడియాతో కలసి టాలీవుడ్‌ హీరోయిన్లపై దాడి… ఏం జరుగుతోంది?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో జరుగుతున్న డిస్కషన్లలో ఇద్దరు హీరోయిన్ల పేర్లు తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్లలో ఒక హీరోయిన్‌ చేస్తున్న సినిమాలు విజయాలు సాధించడం లేదంటూ ‘ఐరెన్‌ లెగ్‌’ అనే ట్యాగ్‌ అతికించేశారు. మొన్నటివరకు ఆమెను గోల్డెన్‌ లెగ్‌ అని కూడా అన్నారు అనుకోండి. ఇంకో హీరోయిన్‌కి శ్రీలీల సెగ బాగా తగులుతోంది అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె సినిమాలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయి అనేది ఆ కామెంట్ల ఆన్సర్‌. అయితే ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇదంతా బాలీవుడ్‌ కేంద్రంగా సాగుతోంది అని మాత్రం చెప్పొచ్చు.

అంత క్లియర్‌గా ఎలా చెబుతున్నారు అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా ఈ వార్తలు, లీక్‌లు, పుకార్లు రావడాన్ని గమనిస్తేఈ విషయం తెలిసిపోతుంది. తొలుత ఓ చిన్న లీక్‌ బాలీవుడ్‌లో ఓ చిన్న సైట్‌లో కనిపిస్తోంది. ఆ తర్వాత అది అలా అలా పాకుకుంటూ తెలుగు మీడియాలోకి వస్తోంది. ఎవరు, ఎక్కడ, ఎలా, ఎందుకు అన్నారనే విషయంలో క్లారిటీ లేకపోయినా.. ఆ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ఆ నాయికలు, లేదంటే వాళ్ల టీమ్‌లు వాటిపై వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ మొత్తం ఘటనలు గత కొన్ని నెలలుగా సాగుతున్నాయి.

ఇందులో ఏం సంబంధం లేకపోయినా శ్రీలీల పేరు లాగుతున్నారు అని కూడా చెప్పొచ్చు. ఆమె ఎవరిదో సినిమాను లాగేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆమెకున్న క్రేజ్‌, బజ్‌ వల్ల వరుస సినిమాలు వస్తున్నాయి. అనుకోకుండా కొన్ని పాత్రలు వస్తున్నాయి. అయితే ఆ నాయికల పాత్రలే శ్రీలీలకు వస్తున్నాయి అని పుకార్లలో షికారు అంశాలు చెబుతున్నాయి. దీంతో అసలు ఈ దాడి ఎందుకు జరుగుతోంది. ఎవరు చేయిస్తున్నారు అనే చర్చ ఆ ఇద్దరు నాయికల ఫ్యాన్స్‌లో జరుగుతోంది. ఎవరో గిట్టనివాళ్లు చేస్తున్నారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో ఆ ఇద్దరు నాయికలకు వ్యక్తిగత సిబ్బందితో సమస్య వచ్చిన విషయం ఇక్కడ గమనార్హం. దీనికి దానికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ.. ఆ ఇద్దరు హీరోయిన్లు.. శ్రీలీలకు మధ్య అనవసరంగా దూరం పెంచుతున్నాయి ఈ పుకార్లు. ఇంతా చెప్పి ఆ హీరోయిన్లు ఎవరో చెప్పలేదు అనుకుంటున్నారా? శ్రీలీల వార్తలు ఫాలో అవుతున్న వాళ్లకు ఆ ఇద్దరు పాన్‌ ఇండియా హీరోయిన్ల పేర్లు తెలిసే ఉంటాయి లెండి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus