ఇకనైనా ఫ్యామిలీ కథలు బయటకు తీయండర్రా… వాటికీ లైఫ్‌ ఉంది!

సినిమా ఇలాగే ఉంటే చూస్తాం అని ఎప్పుడూ, ఏ ప్రేక్షకుడూ చెప్పలేదు. అలా అని చెప్పిన నచ్చినట్లు సినిమాలు తీసేస్తూ పోతే చూసే ప్రేక్షకుడూ ఉండరు. అలరించే సినిమా అయితే ఎంత ఖర్చయినా చూస్తారు. అక్కరకు రాని సినిమాకు అర్ధ రూపాయి కూడా ఇవ్వరు. ఈ విషయం అర్థం చేసుకోని కొంతమంది దర్శకులు రకరకాల సినిమాలు తీసి ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది అయితే ఫ్యామిలీ డ్రామా సినిమాలకు దాదాపుగా దూరమవుతున్నారు.

Movie

తెలుగు సినిమాలో (Movie) ఫ్యామిలీ డ్రామా బ్యాకప్‌ సినిమాలకు లైఫ్‌ లేదని, ఆ నేపథ్యంలో వచ్చే సినిమాలకు వసూళ్లు లేవని, జనాలు థియేటర్లకు రారు అంటూ ఏవేవో కామెంట్లు చేశారు. దీంతో ఫ్యామిలీ హీరోలు అని మంచి ముద్ర ఉన్న హీరోలు కూడా ఇటువైపు చూడటం మానేశారు. అయితే సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా మొత్తం లెక్కలు మార్చేసింది. కుటుంబ కథా చిత్రాలకూ జనాలు థియేటర్లకు వస్తారని నిరూపించింది.

రూ. 200 కోట్ల గ్రాస్‌ వసూళ్లవైపు దూసుకెళ్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూశాక అయినా అగ్ర హీరోలు, సీనియర్‌ అగ్ర హీరోలు ఈ వైపుగా మళ్లీ చూస్తారేమో చూడాలి. ఫ్యామిలీ ఎలిమెంట్‌ ఎప్పుడూ హిట్‌ టాపిక్కే అని నిరూపిస్తూ జనాలను తండోపతండాలుగా థియేటర్లకు రప్పించింది. హాస్యం, స‌ర‌దా స‌న్నివేశాల‌తో బాగా రాసుకొచ్చారు అనిల్‌ రావిపూడి.

ఆయన ఇలాంటి కథల్ని (కాస్త మార్చి అనుకోండి) మన స్టార్‌ హీరోలతో తీస్తే మనకు కుటుంబ కథా చిత్రాల కొరత తీరిపోతుంది. ఆయన ఎలాగూ మూడు నెలల్లో ఆయన సినిమా చేసేస్తారాయన. కాబట్టి హీరోలు ముందుకొస్తే ఆయన రెడీ. ఆయనను చూసి ఇతర దర్శకులూ రెడీ అవ్వాలి. అవుతారు కూడా. ఒకవేళ అవ్వకపోతే ట్రెండ్‌కి తగ్గట్టుగా వాళ్లు ముందుకు రావడం లేదనే అర్థం. మన దగ్గర ఇలా ట్రెండ్‌ను పట్టని వాళ్లు ఇండస్ట్రీకి దూరమవుతున్న విషయం మీకు తెలిసిందే.

‘VD12’ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus